తెలంగాణ

మాట్లాడుకుందాం రండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అభ్యర్థుల ప్రకటనతో టీఆర్‌ఎస్‌లో పెల్లుబికిన అసమ్మతి నేతల బుజ్జగింపు పర్వం ప్రారంభమైంది. కొంత మంది అసంతృప్తి నేతలకు మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్లు చేసి వారిని బుజ్జగిస్తుండగా, చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు మాత్రం పార్టీ అధినేత, సీఎం కేసీఆరే స్వయంగా ఫోను చేసి హైదరాబాద్‌కు వచ్చి కలువాల్సిందిగా కబురు చేసారు. ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడిన హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ను మంత్రి కేటీఆర్ పిలిచి బుజ్జగించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీ నేతలకు అందుబాటు లేకుండా బొంతు రామ్మోహన్ తన ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసిన విషయం తెలిసిందే. బొంతుకు ఉప్పల్ టికెట్ ఇవ్వాలని పలువురు కార్పొరేటర్లు పార్టీ ముఖ్యులను కలిసి కోరారు. ఈ విషయాన్ని మంత్రి నాయిని నరసింహారెడ్డి దృష్టికి కొందరు కార్పొరేటర్లు తీసుకెళ్లగా, తన అల్లుడి టికెట్‌కే ధిక్కు లేదు, ఇక ఇతర గురించి ఎవరికి ఎలా చెబుతానని నిస్సాహయత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఉప్పల్ టికెట్ దక్కక పోవడంతో మేయర్ రామ్మోహన్ మనస్థాపానికి గురిన విషయం పార్టీ అధిష్టానం వరకు వెళ్లింది. దీంతో మంత్రి కేటీఆర్ మేయర్ రామ్మోహన్‌ను స్వయంగా పిలిచి బుజ్జగించినట్టు తెలిసింది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, ఉప్పల్ ప్రాంత కార్పొరేటర్లు కూడా అభ్యర్థుల ఎంపిక పట్ల అసంతృప్తితో ఉండటంతో వారితో చర్చించి బుజ్జగించే బాధ్యతను మంత్రి కేటీఆర్ మేయర్‌కే అప్పగించినట్టు తెలిసింది.
చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లా ఓదెలుకు పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన తీవ్ర మనస్థాపంతో తనకు తానుగా గృహ నిర్భందంలోకి వెళ్లడంతో పార్టీ అధినేత కేసీఆరే స్వయంగా ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్‌కు వచ్చి బుధవారం తనను కలవాల్సిందిగా ఆదేశించారు. టికెట్ ఆశించి భంగపడిన అసమ్మతి నేతల జాబితా సిద్ధం చేసి ఒకొక్కరితో స్వయంగా మాట్లాడే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ సిద్ధం చేసుకున్నారు. తనను కలువాల్సిందిగా అసమ్మతి నేతలు పలువురికి మంత్రి కేటీఆరే సోమవారం ఫోను చేసినప్పటికీ, కొండగట్టులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన నేపథ్యంలో మంగళవారం ఇచ్చిన అపాయింట్‌మెంట్లను మరొసటి రోజుకు వాయిదా వేసినట్టు వారికి సమాచారం అందించినట్టు తెలిసింది.
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారి స్థానంలో గెలిచిన టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు 20 మంది ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. వీరి స్థానంలో గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారితో పార్టీ అధినేత కేసీఆరే స్వయంగా చర్చించనున్నారని పార్టీ వర్గాల సమాచారం.