తెలంగాణ

ఎన్నికలకు ముందే పీఆర్‌సీని ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఎన్నికలకు ముందే పీఆర్‌సి (పే రివిజన్ కమిషన్) సిఫారసులను ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సిబ్బంది, పెన్షనర్స్ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. అపద్ధర్మ ప్రభుత్వం కూడా పీఆర్‌సీని ప్రకటించవచ్చని జేఎసి సూచించింది. తెలంగాణ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సిబ్బంది, పెన్షనర్స్ సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి మమత అధ్యక్షతన మంగళవారం టీఎన్‌జివో భవన్‌లో సమావేశమైంది.
ఈ సమావేశంలో 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలిసి అందజేసింది. పీఆర్‌సిని ప్రకటించి జూలై ఒకటి నుంచి అమలు చేయాలని, 43 శాతం ఐఆర్‌ను మంజురు చేయాలని జేఎసి డిమాండ్ చేసింది.
కొత్త పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని కోరింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌ను విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రంధాలయ సంస్థ ఉద్యోగులకు అమలు చేయాలని కోరింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం చెల్లించాలని కోరింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులను తిరిగి రాష్ట్రానికి తీసుకరావాలని జేఎసి డిమాండ్ చేసింది. ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేసింది.

చిత్రం..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి డిమాండ్ల పత్రాన్ని సమర్పించిన గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ,
ఉపాధ్యాయ, కార్మిక, సిబ్బంది, పెన్షనర్స్ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకుల బృందం