తెలంగాణ

వరంగల్ ఎన్‌ఐటీ ఓ మినీ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 11: వరంగల్ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక మినీ భారత్ లాంటిదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మంగళవారం మంత్రి వరంగల్ పర్యటనలో భాగంగా నాలుగు భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్‌ఐటీ 60 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన, పచ్చదనంతో నిండిన, అద్భుతమైన భవన నిర్మాణాల సముదాయం కలిగిన గొప్ప క్యాంపస్ అని కొనియాడారు. విద్యార్థులపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, భవనం నిర్మించినప్పుడు అనుకున్న అంచనా కంటే ఎక్కువ వ్యయం అవుతుందని, కాని ఎన్‌ఐటీలో కట్టిన భవనాలు తక్కువలో అయినందుకు సీపీ డబ్ల్యుడీ వారిని అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాకుల వల్ల దేశంలోని విద్య సంస్ధల మధ్య పోటీ వాతవారణం నెలకొందని, దీంతో నాణ్యమైన విద్య వస్తుందని తెలిపారు.
వరంగల్ ఎన్ ఐటీ ర్యాంక్ మెరుగుపడిందని, భవిష్యత్తులో ఐ ఐటీ దాటి ముందుకు పోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌ఐటీ ఈ స్ధాయికి రావాడానికి ప్రధాన కారణం సమర్ధులైన అధ్యాపకులు, విద్యార్ధులలో నైపుణ్యతే కారణం అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న పాలసీల వల్ల కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ బలపడుతుందని తెలిపారు. పరిశ్రమలు, విద్యాసంస్ధల సమన్వయంతోనే దేశాభివృద్ధి జరుగుతుందని, ఈ దిశలో వరంగల్ ఎన్ ఐటీ ప్రయత్నించాలని ఆకాంక్షించారు. దేశం నుండి వలసపోతున్న రిసెర్చ్ అపడానికి ప్రధాన మంత్రి రీరెర్చ్ ఫెలోషిప్ అనే కొత్త పథకంను ప్రవేశపెట్టి సక్సెస్ అయ్యారని తెలిపారు. అనంతరం విద్యార్ధిని విద్యార్ధులకు మంత్రి సర్ట్ఫికెట్స్‌ను ప్రదానం చేశారు. అనంతరం నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ డైరెక్టర్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ఇది డైమండ్ జూబ్లీ సంవత్సరం అని అక్టోబర్ 8న ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని నిట్ డైరెక్టర్ జ్ఞాపిక, మొక్కతో సత్కారించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కెప్టెన్ లక్ష్మికాంతరావు, బండా ప్రకాశ్, వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, రిజిస్ట్రార్ ఎస్ గోవర్ధన్, సీపీ డబ్ల్యుడీ ఛీఫ్ ఇంజనీర్ ఎస్ ఎస్‌రావు పాల్గొన్నారు.