తెలంగాణ

మొదలైన టి.ఎమ్సెట్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం ఎమ్సెట్-2 నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులను జూన్ 1నుండి స్వీకరించనుంది. దాదాపు 60వేల మంది పరీక్షకు దరఖాస్తు చేస్తారని అంచనా. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువమందికి హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాలకు సన్నాహాలు చేస్తున్నారు. రాజధానిలోని వివిధ వర్శిటీల్లోని కేంద్రాలను ఇప్పటికే ఎమ్సెట్ అధికారులు మాట్లాడి ఉంచారు. ఎక్కువమంది హైదరాబాద్ నుంచే పరీక్షకు హాజరుకావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 7వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. 500 రూపాయిల జరిమానాతో జూన్ 14వరకూ, వెయ్యి రూపాయిల జరిమానాతో జూన్ 21వరకూ, 5 వేల జరిమానాతో జూన్ 28వరకూ, 10వేల జరిమానాతో జూలై 6 వరకూ దరఖాస్తులు స్వీకరించారు. జూలై 2 నుంచి అభ్యర్ధులు తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష జూలై 9న జరుగనుంది. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకూ పరీక్ష నిర్వహించనున్నట్టు ఎమ్సెట్ కన్వీనర్ ఎన్‌వి రమణారావు చెప్పారు. సాధారణ అభ్యర్ధులు 500 రూపాయిలు, ఎస్సీ, ఎస్టీలు 250 రూపాయిలు పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిలబస్‌ను ఇప్పటికే ప్రకటించామని, ఎమ్సెట్-1లో ఉన్న సిలబస్‌నే ఎమ్సెట్-2కు ప్రకటించినట్టు కమిటీ వివరించింది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో చేరాలంటే నీట్ రాయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం, అనంతరం అనేక మలుపులు తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల భర్తీకి సొంత పరీక్షలను నిర్వహించుకోవచ్చని పేర్కొంటూ కేంద్రం ఆర్డినెన్స్‌ను జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఎమ్సెట్ -2 నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లకు, ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లకు మాత్రమే ప్రవేశపరీక్ష వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా జూలై 20నాటికి ఫలితాలు ప్రకటించాలని కమిటీ యోచిస్తున్నట్టు తెలిసింది.