తెలంగాణ

దూకుడు పెంచుతున్న తెలంగాణ బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం పర్యటించి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ తెలంగాణ శాఖ నాయకులు దూకుడు పెంచారు. వచ్చే మూడేళ్ళలో తెలంగాణ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడి పని చేయాలని, బిజెపి అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదంటూ అమిత్ షా చేసిన ప్రసంగంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. దీంతో సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం కార్యకర్తల రాకతో సందడిగా మారింది. ఇలాఉండగా ఈ నెల 10న అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అధ్యక్షతన సోమవారం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చర్చించారు. ఎప్పుడూ హైదరాబాద్‌లోనే సభలు, సమావేశాలు నిర్వహిస్తారా? జిల్లాల్లో నిర్వహించండి, ఏర్పాట్లన్నింటినీ చూసుకుంటాం అంటూ నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నాయకులు పట్టుబట్టారు. దీంతో ఈ దఫా నల్లగొండ జిల్లా సూర్యాపేటలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు, బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇతర నాయకులు హాజరయ్యారు. ఆదివారం శంషాబాద్‌లో నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తల సమావేశం విజయవంతం కావడంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
క్రమశిక్షణా రాహిత్యంపై అమిత్ షా మందలింపు
పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మందలింపు గురించి డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. అమిత్ షా ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని నోవాటల్ హోటల్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అయితే విలేఖరుల సమావేశం వద్దకు నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావద్దని శంషాబాద్‌లోని ఎస్‌ఎస్ కనె్వన్షన్ హాలులో జరిగే సభ వద్దకే అందరూ చేరుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకులు ఆదేశించినప్పటికీ, కొంత మంది నాయకులు, కార్యకర్తలు ఆ హోటల్‌కు వచ్చారు. విలేఖరుల సమావేశం జరిగిన కాన్ఫరెన్స్ హాలులోనూ కొంత మంది విలేఖరులతో పాటు కూర్చున్నారు. ఇది గమనించిన అమిత్ షా పార్టీ రాష్ట్ర నాయకులను గట్టిగా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని లక్ష్మణ్ ఈ సమావేశంలో చెబుతూ వారిని గుర్తించి, క్రమశిక్షణా ఉల్లంఘన నోటీసులు పంపించాలని అన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఎస్‌ఎస్ కనె్వన్షన్ హాలులో వేదిక వెనుక భాగంలో కార్యకర్తలు బందోబస్తులో ఉన్న పోలీసులతో గొడవ పడడం కూడా అమిత్ షాకు చికాకు కలిగించిన విషయాన్ని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. ఆ గొడవ కారణంగానే తన ప్రసంగాన్ని తొందరగా ముగించినట్లు అమిత్ షా అన్నారని ఆయన తెలిపారు. ఇటువంటివి పునరావృతం కారాదని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
హైకోర్టు విభజనకు చర్యలు
ఇలాఉండగా తెలంగాణ బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ అధ్యక్షతన సెల్ నాయకులు ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి హైదరాబాద్ హైకోర్టు విభజనకు చర్యలు చేపట్టాలని కోరారు.