తెలంగాణ

సీఎం..ఈసీపై కేసు వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లినందున వీటి ఆధారంగా శాసనసభ ఎన్నికలు జరుపకూడదంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులపై త్వరలోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం విలేఖరులకు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, రాష్ట్ర ఎన్నికల మాజీ అధికారి భన్వర్‌లాల్‌తోపాటు ఎన్నికల కమిషన్‌పై కేసు పెడతామని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది.. అయితే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అసెంబ్లీ ఎన్నికలు జరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నామని శశిధర్ రెడ్డి చెప్పారు. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలను ప్రతిపాదించినప్పుడు ఒప్పుకున్న చంద్రశేఖరరావు ఇప్పుడెందుకు యు-టర్న్ తీసుకున్నారని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రశేఖరరావు ఒత్తిడి మూలంగానే రాష్ట్ర ఓటర్ల జాబితా నుండి అర్హులైనవారి పేర్లను తొలగించారని ఆయన ఆరోపించారు.