తెలంగాణ

యువరాజు పట్ట్భాషేకానికి గులాబీ దళపతి కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, సెప్టెంబర్ 18 : తమ ఏకైక వారసుడు, ముద్దుల తనయుడు తారక రామారావుకు తెలంగాణ రాజ్యాధికార పట్ట్భాషేకం చేయడానికి తెరాస వ్యవస్థాపక అధినేత చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు దాదాపు అవుననే సమాధానం లభిస్తున్నది. తాజా పరిస్థితుల పరిశీలనాధారంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలని కేసిఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. శాసనసభా వ్యవహరాల సమయంలో తరుచూ, మామకు ప్రసంగ పాఠాలు, అవసరమైన నోట్సు తయారు చేసిన నేపథ్యం నుండి తెరాస ఉద్యమ పార్టీ స్థాపన, ప్రత్యేక రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమ ఉధృతి సమయాలలో సమయస్పూర్తికి మారుపేరైన తన్నీరు హరీష్‌రావు పాత్ర విస్మరించ రానిది. చతురవచోనిధియై, చమత్కార, ప్రజాకర్షణాయుక్త ప్రసంగాలలో ఆరితేరిన కేసిఆర్‌కు అన్ని దశలలోనూ వెన్నుదన్నుగా నిలిచిన విశ్వస నీయుడు హరీష్‌రావు. ఇంకా చెప్పాలంటే ప్రజాకర్షణగల నేతగా, కేసిఆర్ ‘‘ఓట్ క్యాచర్’’గా లబ్దప్రతిష్థులైతే, అన్ని సందర్భాలలో సాటిలేని ‘‘మేటి ఆర్గనైజర్’’గా హరీష్‌కు గుర్తింపు పొందారు. కేసిఆర్ ప్రతి కార్యక్రమం తెర వెనుక మేనల్లుని పాత్ర విగ్రహాన్ని పడిపోకుండా నిలబెట్టే వెనుక ఉండే బలమైన సపోర్ట్ రాయిలాంటిదని రాజకీయ పండితులు చెపుతారు. అనేకానేక సందర్భాలలో కేసిఆర్‌ను బలహీన పరుస్తూ, అధికారం నుండి తప్పించే యత్నంలో హరీష్‌రావుకు కాంగ్రెస్ గాలం వేస్తున్నదని ప్రచారాలు జరిగాయన్నది తెలంగాణ జనమెరిగిన సత్యం. హరీష్‌రావుకు ఇప్పటి వరకు మెజారిటీ శాసనసభ్యులతో ఉన్న సంబంధాలు గులాబి దళపతికి తెలియనిది కాదు. తెలంగాణ తొలి శాసనసభ గడువు సమీపిస్తున్న తరుణంలో, సమీప భవిష్యత్తుపై దూర దృష్టి ఉంచిన తెరాస అధినేత, ఇటీవల పార్టీ తదితర వ్యవహారాల విషయంలో ముద్దుల తనయునికి అనుభవం చేకూర్చే క్రమంలో ఎన్నో అప్పగింతలు గావించారు. జగిత్యాల పట్టణంలో తొందొలుతగా కుమారుడు, కూతురును వేదికపైకి పంపి, ప్రజల స్పందన ఎలా ఉండగలదోనని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అనంతరం గ్రాండ్ రిహార్సల్‌గా ప్రధానంగా ఇటీవలి హైదరాబాద్ నగర ఎన్నికల పూర్తి స్థాయి బాధ్యతలు, నిర్ణయాధికారం కేటిఆర్‌కే అప్పగించగా, తారక రాముడు తనదైన శైలిలో ప్రచార బాధ్యతలు భుజాలకెత్తుకుని, ఘన విజయం సాధించి, తొలి ప్రయత్నంలోనే (క్రికెట్ పరిభాషలో డెబ్యూ) సంచరీకి చేరువై, కనీ వినీ ఎరగని ఫలితాలు రాబట్టడంతో, కేసిఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తండ్రికి తగ్గ తనయునిగా, కేటిఆర్, కేసిఆర్‌కు తగిన వారసునిగా తెరాస క్యాడర్ ఆమోద ముద్ర వేసేందుకు ఈ ఎన్నికల ఫలితాలు, కేటిఆర్ కృషి ఆధారభూతాలైనాయి. ఇదే అదనుగా ఇటీవల నిర్వహించిన ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు నిర్వహణ తదితరాల బాధ్యతలను కన్న కొడుకుకే అప్పగించడంలోని పరమార్థమూ అదేనని రాజకీయ విశే్లషకుల భావన. అంతేకాకుండా రానున్న ఎన్నికల కోసం ప్రకటిత 105మంది అభ్యర్థుల గురించి అసమ్మతి, అసంతృప్తుల విషయంలోనూ బుజ్జగింపులకు, పరిస్థితుల చక్కదిద్దుటకు సంపూర్ణ బాధ్యతలు తనయునికే అప్పగించడమూ గమనార్హం.
ఇక మనసులో ఏమున్నా, తనకు అధినాయకుడు నాడూ నేడూ కేసిఆర్‌యేనని, పార్టీ అధినేత, కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి, తనను ఆ మంత్రివర్గంలో పని చేయమన్నా అందుకు సిద్ధమేనని ఇటీవల హరీష్‌రావు స్వయంగా ప్రకటించడం రానున్న రాజకీయ యవనికపై చోటు చేసుకోనున్న పరిణామాలకు దర్పం పడుతుందనేది కొస మెరుపు. ప్రభుత్వాధికారం ఏపార్టీ, ఎవరు చేపట్టనున్నా, తెరాస సర్వసైన్యాధ్యక్షునిగా, రానున్న రోజులలో పార్టీకి పెద్ద దిక్కుగా తారక రామారావు కానున్నారనేది కేసిఆర్ మనసులో రూపుదిద్దుకున్న ఆలోచన అనేది ఇటీవలి పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.