తెలంగాణ

బాబును ప్రచారానికి పిలుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం సీట్లను సర్దుబాటు చేసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు కూటమి తరపున రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు తెలంగాణలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తేనే కూటమి పట్ల రాష్ట్ర ప్రజలకు విశ్వాసం కలుగుతుందని సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పినట్లు తెలిసింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రా ప్రాంతం ప్రజలు పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటే చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయాలన్నది వారి వాదన. రాహుల్ గాంధీ ఎలాగూ తెలంగాణలో పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తారు, ఆయనతోపాటు చంద్రబాబు కూడా తెలంగాణలో పర్యటించి కూటమి తరపున ఎన్నికల ప్రచారం చేస్తేనే ఆశించిన ఫలితాలను సాధించగలుగుతామని వారు పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. కేవలం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని చంద్రబాబు ప్రచారం చేయకపోతే కూటమి పట్ల ప్రజలకు విశ్వాసం కలుగదు.. ఓట్లు పడవని వారు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే రాహుల్, చంద్రబాబు పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం చేయాల్సిందేనని వారు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు ఎన్నికల ప్రచారం చేసినంత మాత్రాన టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కూటమికి బదిలీ కావు.. చంద్రబాబు తెలంగాణలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేసినప్పుడే తెలుగుదేశం ఓట్లు, ఆంధ్రుల ఓట్లు కూటమికి బదిలీ అవుతాయని రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు రాహుల్‌కి స్పష్టం చేసినట్లు తెలిసింది.