ఆంధ్రప్రదేశ్‌

30న కానిస్టేబుల్‌పోస్టులకు రాత పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 16.925 కానిస్టేబుల్స్ పోస్టులకు ఈ నెల 30వ తేదీన రాత పరీక్షలు నిర్వహంచనున్నట్లు రాష్ట్ర పోలీస్ నియామకపు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. 2018 మే 30వ తేదీన వెలువడిన నోటిఫికేషన్ నిబంధనల మేరకు కానిస్టేబుల్స్ నియామకాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల 30వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని, వీటికి సంబంధించిన హాల్‌టికెట్లును పోలీస్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఈనెల 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లు కోసం పోలీస్ వెబ్‌సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ టిఎస్‌ఎల్‌పిఆర్‌బి డాట్ ఇన్‌లో పరిశీలించుకోవచ్చునని చెప్పారు. అభ్యుర్థులు తమకు హాల్‌టికెట్ దక్కకపోతే 93937-11110 లేదా 93910-05006 ఫోన్ నెంబర్లను సంప్రధించవచ్చునని చెప్పారు. హాల్‌టికెట్ల బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో ఉండాలన్నారు. ఎ4 సైజ్‌లో హాల్‌టికెట్‌తో పాటు అభ్యర్థి పాస్‌ఫోటో తీసుకోవాలని ఆయన సూచించారు. పరీక్షకు ముందు రోజు అంటే 29వ తేదీన అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని సందర్శించి మరుసటి రోజు 30 వతేదీన ఒకనిమిషం ఆలస్యాన్ని కూడా పోలీసులు అనుమతించరని ఆయన హితవు పలికారు. ఎలాంటి ఉచిత రవాణా సౌకర్యం కల్పించమన్నారు. పరీక్షా కేంద్రలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలన్నారు. అభ్యర్థల వస్తువులను ఉంచడానికి ఎలాంటి సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు. పరీక్షలు రెండు భాషల్లో ఇంగ్లీష్-తెలుగు, ఇంగ్లీష్- ఉర్దూలలో ఉంటుందని బోర్డు చైన్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు.