తెలంగాణ

ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైందని, ప్రతి పౌరుడు తన పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల పొరపాట్లు జరుగుతూ ఉంటాయని, జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సి ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల 25 వరకు గడవు ఇచ్చామని, ప్రస్తుతం సవరణ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ గడవును పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఏవైనా కారణాల వల్ల ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలిగిన వారు ఇప్పుడు తమ పేర్లను తిరిగి నమోదు చేసుకోవచ్చని, ఇందుకోసం నిర్ణీత ఫారంలో దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. 2018 జనవరి 1 వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండి ఓటరుగా నమోదు కాని యువతీ యువకులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు నిర్ణీత ఫారంలో దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. దరఖాస్తు ఇవ్వకపోతే పేర్లను నమోదు చేయడం ఇబ్బంది అవుతుందని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమకు సహకరించాలని కోరారు. గడవు ఉందికదా అంటూ రోజులు గడిపివేయవద్దని వెంటనే దరఖాస్తు చేయాలని పిలుపు ఇచ్చారు.
ఎవరిపేర్లయినా రెండు చోట్ల, రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఓటర్ల జాబితాలో నమోదై ఉంటే ఒకే చోట ఓటరుగా నమోదై ఉండేలా చూస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామన్నారు. ఓటరు ఫోటో, పేరు, వయస్సు, తండ్రిపేరు, ఇంటినెంబర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితానుండి తొలిగిస్తామని, ఇందుకోసం రిజిస్ట్రార్ ఆఫీసు సహకారం తీసుకుంటామన్నారు. ఓటర్ల జాబితా సవరణకోసం పోలింగ్ కేంద్రాల్లో బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) లు అందుబాటులో ఉన్నారని రజత్‌కుమార్ తెలిపారు. 80 సంవత్సరాలు ఆపైగా వయస్సున్న వారి పేర్లను తనిఖీ చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను జిల్లాలకు పంపించామని, నాలుగైదు జిల్లాల్లో వీటి తనిఖీని కూడా చేస్తున్నామని సీఈఓ వివరించారు. ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు పచ్చ జెండా ఊపినా, నిర్వహించేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.