తెలంగాణ

సాధారణ ఎన్నికల్లో ఆటో, హ్యాట్ గుర్తులుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆటో, హ్యాట్ గుర్తులు ఉండబోవని, ఈ గుర్తులను అభ్యర్థులకు కేటాయించబోరని పార్లమెంట్ సభ్యులు బి. వినోద్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేస్తూ, 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కారు గుర్తుతో పోటీ చేసిందని, ఆటో, హ్యాట్ గుర్తులను అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఇతర అభ్యర్థులకు కేటాయించడం వల్ల ఓటర్లలో అయోమయం నెలకొందన్నారు. టీఆర్‌ఎస్ గుర్తు కారు అని, ఆటో, హ్యాట్ గుర్తులు కారు గుర్తును పోలి ఉండటం వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యాన్నారు. ఈ కారణంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆటో, హ్యాట్ గుర్తులను అభ్యర్థులకు ఇవ్వకుండా రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 2015 లోనే లేఖరాశారని గుర్తు చేశారు. కేసీఆర్ కోరిక మేరకు ఆటో, హ్యాట్ గుర్తులను తెలంగాణ, ఆంధ్రపదేశ్‌లలో అభ్యర్థులెవరికీ కేటాయించబోమని, ఈ రెండు గుర్తులను ఎన్నికల కమిషన్ రూపొందించిన గుర్తుల జాబితా నుండి తొలగించారని వినోద్ తెలిపారు. ఇదే అంశాన్ని తెలంగాణ రాజపత్రంలో 2018 జూలైలోనే వివరించారని తెలిపారు. ఈ గుర్తుల విషయంలో కొన్ని పత్రికల్లో తాజాగా వచ్చిన కథనాలను ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు.