తెలంగాణ

27న మహిళా సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణలో ఈ నెల 27వ తేదీన బీజేపీ మహిళామోర్చ మహిళా సమ్మేళనాన్ని నిర్వహించనుందని, దానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు. మహిళామోర్చ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపుతోందని అన్నారు. అందుకే వారిని ఇంటికి పరిమితం చేసిందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తే, టీఆర్‌ఎస్ మాత్రం వారిని ఇంటికే పరిమితం చేసిందని మండిపడ్డారు. మహిళా రుణాలకు వడ్డీ మాఫీ, అభయ హస్తం, స్ర్తి నిధి ఇలా ఏ పథకమూ సక్రమంగా అమలు కాలేదని అన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుండా ఓటు అడగనన్న కేసీఆర్ ఇపుడు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారంటూ ప్రశ్నించారు. పరీక్షల్లో పుస్తెలు తీయమని చెప్పడం హిందూ సంస్కృతిని అవమానించడమేనని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల విజయ అభిప్రాయపడ్డారు. మహిళలు బీజేపీ వెంట ఉన్నారని తెలిపేలా ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. మహిళలకు తగినన్ని సీట్లు కేటాయించాలని ఈ సందర్భంగా మహిళా నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌ను కోరారు.

చిత్రం..మహిళా సదస్సులో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్,
వేదికపై మహిళా మోర్చ నేత ఆకుల విజయ తదితరులు