తెలంగాణ

ఉద్రిక్తతల నడుమ గట్టయ్య అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, సెప్టెంబర్ 19: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో జరిగిన సంఘటనల్లో రేగుంట గట్టయ్య మృతితో ఇందారం గ్రామంలో విషాదం అలుముకుంది. ఉద్రిక్తత నడుమ గట్టయ్య అంతిమ వీడ్కోలు బుధవారం జరిగింది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఇందారం గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవానికి ఈనెల 12న వచ్చిన సందర్బంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రేగుంట గట్టయ్య 8రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయన సంగతి తెలిసిందే. రేగుంట గట్టయ్య మృతదేహాన్ని హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి నుండి ఇందారం గ్రామానికి మంగళవారం రాత్రి పోలీసుల బందోబస్తు మధ్య తరలించారు. మృతదేహాన్ని చూడటానికి ఇందారంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంగళవారం రాత్రే గట్టయ్య మృతదేహన్ని అంత్యక్రియలు చేయడానికి పోలీసులు యత్నించినప్పటికీ కుటుంబీకులు, బంధువులు ఒప్పుకోకపోవడంతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, ఎమ్మార్పీఎస్ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు పెద్దఎత్తున తరలి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గట్టయ్య మృతికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎంపి బాల్క సుమన్ కారణం అంటూ నిరసన వ్యక్తం చేశారు. గట్టయ్య భార్య విజయ, సోదరుడు తిరుపతి, పిల్లలు గట్టయ్య మృతికి ప్రభుత్వమే కారణమంటూ కావున రూ. 50లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేదాక అంత్యక్రియలు నిర్వహించేది లేదని గృహనిర్బంధం చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. జైపూర్ ఏసిపి వెంకట్ రెడ్డి, సీఐ నారాయణ్ నాయక్, తమ సిబ్బందితోవచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి కుటుంబీకులను బయటకు తీసుకొచ్చారు. సమాచారాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఫోన్‌లో మాట్లాడుతూ గట్టయ్య కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటానని అందోళన తగదని హామీ ఇవ్వడంతో కుటుంబీకులు, ఆందోళన విరమించారు. కాగా దళితుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎంపి బాల్క సుమన్‌తో కలిసి నియోజకవర్గంలో తిరిగితే రాజకీయపతనం తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఓదెలు దొరల వద్ద దళితుల గౌరవాన్ని తాకట్టు పెట్టి బతుకుతున్నారన్నారు. గట్టయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు నష్టపరిహారం ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.