తెలంగాణ

జనగామ జిల్లాలో టీఆర్‌ఎస్ అసమ్మతి జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 20: పోరుగడ్డగా పేరున్న జనగామ జిల్లాలో టీఆర్‌ఎస్ అసమ్మతి వర్గం రోజురోజుకు గళాన్ని పెంచుతోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏక కాలంలో తెలంగాణలో పోటీచేసే 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో వివిధ నియోకవర్గల్లో టికెట్ అశిస్తున్న అశావాహులు కంగుతున్నారు. నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా ఆశావాహులు తమకే టికెట్ కావాలంటూ ఆందోళనకు తెర లేపారు. ప్రధానంగా జనగామ జిల్లా పరిధిలోకి వస్తే జనగామ, స్టేషన్‌ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఆశావాహులు రోజురోజుకు పార్టీ అదిష్ఠానంపై అసమ్మతి గళాన్ని పెంచుతున్నారు. జనగామ జిల్లాకు సిట్టింగ్ తాజా మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), డాక్టర్ రాజయ్య (స్టేషన్‌ఘనపూర్), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి) ఈ నియోజకవర్గాల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్ధులకు పోటీగా అశావాహులు ప్రచారాన్ని ప్రారంభించారు. తెరాస అశావాహుల ఎన్నికల పోటీ ప్రచారం ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తుండడంతో రాష్ట్ర పార్టీ రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డిని దూతగా పంపించింది. ప్రధానంగా ముందుగా స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధి రాజయ్యపై గురిపెట్టారు. రాజయ్య చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి పాల్గొనడంతో అక్కడి నుండి టికెట్ ఆశీస్తున్న రాజరాపుప్రతాప్ వర్గీయులు తప్పుపట్టారు. దీంతో ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి వారికి వివరణ ఇచ్చారు. రాజయ్య అవినీతి భాగోతం, మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు తెలియంది కాదంటూ చెప్తూనే ఇప్పటికే ఈ విషయం అధిష్ఠానం వరకు వెళ్లిందని తెలియజేశారు. స్టేషన్ ఘనపూర్ సీటు డిప్యూటీ సీఏం కడియం శ్రీహరి, లేదా ఆయన కూతురు కడియం కావ్య ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా పాలకుర్తి నియోజకవర్గంలో ఇదే పరిస్ధితి నెలకొంది. అక్కడి అభ్యర్ధి, తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అభ్యర్ధిత్వాన్ని మార్చాలంటూ అదే సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి వరంగల్‌జిల్లా టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఆ సీటును ఆశిస్తున్నారు. ఇప్పటికే తనకు పోటీ చేసే అవకాశం కోల్పోయాని ఇక ఈ సారి అయిన పోటీ చేద్దాం అనుకుంటే టీడీపీ నుండి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ నియోజకవర్గంపైనే దస్తి వేసి కూర్చోవడం తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు మింగుడుపడడం లేదు, ఎర్రబెల్లి దయాకర్‌రావు అభ్యర్ధిత్వాన్ని మార్చి తనకు ఈ సారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానంపై గళం పెంచుతునే ఇక తన రాజకీయ భవిష్యత్ తాడోపేడో తేల్చుకుంటానని భాహాటంగానే చెప్తున్నారు. ఇక జనగామ అభ్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విషయంలో రోజురోజుకు అందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని తక్షణమే మార్చాలంటూ దర్నాలతో, రాస్తారోకోలో హోరేత్తిస్తున్నాయి. అయితే టికెట్ అశిస్తున్న ఆశావాహులు మాత్రం తెరపైకి రావడం లేదు. జనగామ జిల్లా పరిధిలో ఈ మూడు నియోజకవర్గాల్లో అసమ్మతిని పార్టీ అదిష్ఠానం ఎలా కట్టడి చేస్తుందో చూడాల్సి ఉంది.