తెలంగాణ

ఓవర్ లోడ్, ఓవర్ టేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: కరీంనగర్ జిల్లా జగిత్యాల కొండగట్టు వద్ద జరిగిన ఆర్‌టీసీ బస్సు ప్రమాదానికి ఓవర్‌లోడ్, ఓవర్‌టేక్ కారణమని సంస్థ చైర్మన్ సోమారపుసత్యనారాయణ వెల్లడించారు. బస్సు బోల్తాపడడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరుపడి ఊపిరి ఆడలేదని, అందువల్లే మరణాలు ఎక్కువ సంభవించాయని గురువారం ఇక్కడ తెలిపారు. కొండ గట్టు రోడ్ ప్రమాదంలో 61 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదానికిగల కారణాలను ఆర్టీసీ చైర్మన్ సోమారపుసత్యనారాయణ వివరించారు. బస్సు భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో సంస్థ తప్పిదం ఉందని అంగీకరించారు. ‘కొండగట్టు పైనుంచి దిగువకు వస్తున్న సమయంలో ఆటో వస్తోంది. దాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ఆర్టీసీ డ్రైవర్ స్పీడ్ పెంచాడు. అలాగే రోడ్ మలుపు ముందు స్పీడ్‌బ్రేకర్ ఉన్న విషయం బస్సు డ్రైవర్ గమనించలేదు. దీంతో ఆకస్మాత్తుగా ఘాట్‌రోడ్‌లోకి బస్సు బోల్తాపడింది’ అని ఆయన వెల్లడించారు.
ఇది తమకు అందిన ప్రాథమిక సమాచారం అని సోమారపుతెలిపారు. బస్సులకు కాలపరిమితి దాటినా వినియోగించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన వాదనతో ఆయన ఏకీభవించలేదు. కాలం చెల్లాయని షెడ్లకు తరలిస్తూపోతే తిప్పడానికి బస్సులే ఉండవని చైర్మన్ పేర్కొన్నారు. ఇప్పుడు తిరుగుతున్న బస్సులన్నింటినీ మార్చాల్సి వస్తుందని ఆయన చెప్పారు. అలా మార్చాల్సి రావడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఉండగా ఆర్టీసీని నష్టాల నుంచి గట్టేకించేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చినట్టే ఆర్టీసీని ఆదుకోడానికి అలాంటి సంస్థలే ముందుకు వచ్చే అకాశం ఉందన్నారు. మరోఎనిమిది నెలల్లో సంస్థ పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేస్తోందని, నివేదిక అందిన తర్వాత పెట్టుబడుల అంశాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు.
కార్మికులను మభ్యపెడుతున్న ఉత్తమ్
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో భాగాస్వామ్యంగా చేర్చుతామని ప్రకటించడాన్ని చైర్మన్ సోమారపుసత్యనారాయణ ఆక్షేపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని ఉత్తమ్ తగుదునని ఇప్పుడు ఉద్యోగులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి హామీలను ఆర్టీసీ కార్మికులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సంస్థ యూనియన్లు డిమాండ్‌లను దశలవారీగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని చెప్పారు. మూల వేతనంలో 16 శాతం పెంచిన విషయాన్ని కార్మికులు గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి అంగీకారం చెప్పలేదా? అని యూనియన్ నేతలను ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆర్టీసీ సీపీఆర్వో కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
చిత్రం.. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ