తెలంగాణ

ముందస్తుకు ముందే లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ముందస్తు ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ నాయకత్వానికి ముందుగా కమిటీల లొల్లి తలనొప్పిగా మారింది. ఇంకా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎంత గందరగోళం ఏర్పడుతుందోనన్న ఆందోళన లేకపోలేదు. ముందస్తును సమర్థవంతంగా ఎదుర్కొవడానికి కాంగ్రెస్ అధిష్టానం తొమ్మిది వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ సీనియర్లలో చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రచార కమిటీని ఆశించిన ఎఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావుకు స్ట్రాటజీ కమిటీ చైర్మన్ బాధ్యత అప్పగించడంతో ఆయన విస్తుపోయారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనై ఆంధ్రకు చెందిన పార్టీ నేత ఒకరు తనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి రాకుండా అడ్డుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా కమిటీల్లో బ్రోకర్లు ఉన్నారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. మరో ఎఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా విమర్శలు చేశారు. పార్టీలో కొత్తగా చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాఉండగా పార్టీ రాష్ట్ర నాయకత్వం దీనిని సీరియస్‌గా పరిగణించి పార్టీ క్రమశిక్షణా సంఘానికి నివేదించడంతో, క్రమశిక్షణా సంఘం చైర్మన్, మాజీ ఎమ్మల్యే ఎం. కోదండ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసు పంపించింది. ముందస్తు ఎన్నికలను సమిష్టిగా ఎదుర్కొవాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాందీ సూచించిన తర్వాత కూడా లుకలుకలు ప్రారంభమయ్యాయని, అధిష్టానం ప్రకటించిన కమిటీలను విమర్శించడం ద్వారా అధిష్టానం తీసుకున్న నిర్ణయానే్న వ్యతిరేకించినట్లు అవుతుందని పార్టీ నాయకులు అంటున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను శిరోధార్యం అనకుండా ఇలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కొంత మంది నాయకులు కోరుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎలా ఉంటుందోనన్న అనుమానాలను పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

మాకూ కోటా ఇవ్వాలి

హైదరాబాద్, సెప్టెంబర్ 21: కాంగ్రెస్‌లో కమిటీల కొట్లాట, అభ్యర్థుల ప్రకటనలో జాప్యం, గందరగోళ పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో అవేవీ పట్టించుకోకుండా సేవాదళ్ ముందస్తు ఎన్నికల ప్రచారానికి సమాయత్తమైంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఒక దఫా పార్టీ తరఫున ప్రచారాన్ని నిర్వహించామని, ఈ నెల 25 నుంచి మరింత ఉధృతంగా ప్రచారాన్ని కొనసాగించనున్నామని ఏఐసీసీకి అనుబంధంగా ఉన్న సేవాదళ్ కోశాధికారి, రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్ రెడ్డి శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈ నెల 6న టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి, ఆ పార్టీ శ్రేణులను ఎన్నికల రణరంగానికి కార్యోన్ముఖులుగా చేశారని ఆయన తెలిపారు. కాబట్టి ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా, తమ పార్టీ తరఫున ప్రచారాన్ని వేగవంతం చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల అధిష్టానం వేర్వేరు కమిటీలను ప్రకటించినందున, వివిధ పార్టీల నుంచి తమ పార్టీలోకి వలసలు ఆరంభమైనందున, పార్టీ రాష్ట్ర నాయకత్వం బీజీగా ఉండవచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాటట్టి పార్టీ తరఫున తాము మరో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 30న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఏకకాలంలో ప్రచారం నిర్వహిస్తామని, సభలు, సమావేశాలు నిర్వహించి తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తామన్నారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందో ఈ సభలు, సమావేశాల్లో ఎండగడతామని కనుకుల చెప్పారు.
పార్టీకీ ఎల్లప్పుడూ సేవ చేస్తూ అండగా నిలబడిన సేవాదళ్ నాయకులను, కార్యకర్తలను గుర్తించి ముందస్తు ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. ముషీరాబాద్ లేదా కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకూ అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ అధిష్టానాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని కోరానని కనుకుల తెలిపారు. అనాదిగా సేవాదళ్‌కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లభిస్తున్నదని ఆయన వివరించారు.