తెలంగాణ

టార్గెట్ కరీంనగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనతో మంచి ఊపుమీద ఉన్న రాష్ట్ర పార్టీ అదే ఊపును కొనసాగిస్తూ తదుపరి భారీ బహిరంగ సభను కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దాని కంటే ముందు మహిళా మోర్చ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. తదుపరి ఎన్నికల షెడ్యూలు ప్రకటించేలోగా మరో రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించి, ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గట్టి పట్టు ఉందని భావిస్తున్న కరీంనగర్ ప్రాంతంలో తదుపరి బహిరంగ సభను నిర్వహించి కేసీఆర్ కుటుంబానికి చెక్ చెప్పాలని బీజేపీ నేతలు సిద్ధపడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహించాలని, పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని తద్వారా బీజేపీకి ఉన్న పట్టును రుజువు చేసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను రంగంలోకి దించి రాజకీంగా గట్టి పొటీ ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. మహబూబ్‌నగర్ సభలో అమిత్ షా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న ఆర్ధిక సాయం, ఇతర అంశాల్లో చేసిన సహకారాన్ని చెప్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టారు. పార్టీ ఈసారి మరింత సాంకేతికంగా పనిచేయాలని, ప్రతి కార్యకర్త కనీసం 15 మందిని ప్రభావితం చేస్తే సత్ఫలితాలు సాధించగలుగుతామని అమిత్‌షా నాయకులకు సూచించారు. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన కార్యక్రమాలు, పథకాల గురించి ప్రముఖుల ఇళ్లకు వెళ్లి వారికి ఒక్కో పథకం గురించి వివరించాలని, ఈ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని కూడా అమిత్ షా సూచించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ఏ ఏ హామీలు ఇచ్చి ప్రభుత్వం వాటిని అమలుచేయడంలో విఫలమైందో చెప్పాలని కూడా అమిత్ షా సూచించారు. ఈసారి ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని, అంకితభావంతో కార్యకర్తలు పనిచేయాలని, దానికి అనుగుణంగా నాయకత్వం సమన్వయంతో తోడ్పడాలని అమిత్ షా మార్గదర్శనం చేశారు.