తెలంగాణ

గదుల్లో బందీగా పీహెచ్‌డీ పరిశోధనలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పీహెచ్‌డీ పరిశోధనా పత్రాలు కేవలం వర్శిటీ లైబ్రరీలకు ఆయా డిపార్టుమెంట్ల ర్యాక్స్‌కు పరిమితం అవుతున్నాయి. శాస్తవ్రిజ్ఞాన రంగాల్లో జరిగిన పరిశోధనలు సైతం గదుల్లో బందీ అవుతున్నాయి. అనేక అంశాలపైనా, నిత్యజీవితంలో వినియోగానికి పనికొచ్చే అనేక పరిశోధనలు కేవలం పరిశోధకుడికి, మార్గదర్శకుడికి , పరిశీలకుడికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. గతంలో పరిశోధనలు అంకితభావంతో జరగ్గా, రానురాను పరిశోధనలు నాశిరకంగా తయారుకావడమేగాక, తొందరగా పరిశోధనను ముగించాలనే లక్ష్యంతో ఎక్కువ భాగం వేరొక పరిశోధన నుండి కాపీ చేసుకుని థీసిస్‌లు రాయడం వల్ల అవి వెలుగు చూస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతో రీసెర్చి గైడ్‌లు సైతం గమ్మున ఉంటున్నారు. ప్రతి విశ్వవిద్యాలయంలో అన్ని విభాగాల్లో కలిపి గరిష్టంగా 600 మంది పరిశోధకులు చేరుతున్నారు. చిన్నచిన్న వర్శిటీల్లో ఏటా పరిశోధనకు చేరుతున్న విద్యార్థుల సంఖ్య వంద వరకూ ఉంటోంది. వీరంతా రెండు మూడేళ్లు తమ పరిశోధన కొనసాగించి పరిశోధనా పత్రాన్ని (్థసిస్)ను సమర్పిస్తున్నారు. ఈ థీసిస్‌ను ముగ్గురు ప్రముఖులకు పరిశీలనకు పంపిస్తారు. ఈ ముగ్గురూ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆ థీసిస్‌కు ఆమోదముద్ర లభిస్తుంది, అంతకంటే ముందు పరిశోధకుడు రెండు దశల్లో వర్కుషాప్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. వర్కుషాప్‌ల అనంతరం ఐదుగురు సభ్యులతో కూడిన బోర్డు వైవా నిర్వహించి ఎక్స్‌టర్నల్ నిపుణులకు , కొన్ని మార్లు బయటిదేశాల ప్రొఫెసర్లకు ఈ థీసిస్‌లను పంపిస్తారు.
అయితే భారతీయ విశ్వవిద్యాలయాలు బయటి దేశాల నిపుణులకు పంపించడానికి భయపడుతున్నాయి. దానికి కారణం కాపీ పీహెచ్‌డీల వ్యవహారాన్ని వెనువెంటనే పసిగట్టే ప్లాగరీజం సాఫ్ట్‌వేర్ వారికి అందుబాటులో ఉండటంతో ఆయా పీహెచ్‌డీలలో కాపీ శాతాన్ని వెంటనే చెబుతున్నారు. ప్రతి పీహెచ్‌డీ థీసిస్‌లో 10 శాతం వరకూ కాపీ ఉన్నట్టు ఈ సాఫ్ట్‌వేర్ తేల్చినా ఇబ్బంది లేదు, కాని చాలా థీసెస్‌లు 80 శాతం వరకూ కాపీ కొట్టినట్టు లెక్కలు తేలుస్తుండటంతో యూనివర్శిటీలు ఇబ్బంది పడుతున్నాయి. అలా రెండుమార్లు ఎక్స్‌టర్నల్ ఎక్స్‌పర్టు ఆ థీసిస్‌ను తిరస్కరించినట్టయితే అది ఎందుకూ పనికిరాకుండా పోతుంది. కొన్ని థీసిస్‌లకు ఇబ్బందులు ఎదురైనా, దానిని అధిగమించి వాటికి అనుమతి లభించినపుడు కూడా గైడ్‌లు ఆన్‌లైన్‌లో ఉంచేందుకు, మిగిలిన పరిశోధకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీనికి కారణం అందులో వ్యవహారాలు బయటకు వస్తే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని భయపడుతున్నారు.ఇక పీహెచ్‌డీ అడ్మిషన్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా, వాటిని ఉల్లంఘించి కొన్ని యూనివర్శిటీల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. మూడు నాలుగేళ్ల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్‌లోని నియమనిబంధనలను కాదని తాజాగా మార్గదర్శకాలు జారీ చేసి పీహెచ్‌డీ అడ్మిషన్లను చేయడంతో అవి వివాదాస్పదమై న్యాయస్థానాలకు వెళ్తున్నాయి.
ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, తెలుగు యూనివర్శిటీ పీహెచ్‌డీ అడ్మిషన్లు వివాదాస్పదమయ్యాయి. అడ్మిషన్లలో అక్రమాలతో ఫెసర్లు, విద్యార్థులు కొట్టుకునే వరకూ పరిస్థితి దిగజారుతోంది. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు, వీసీలు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. ప్రతి విశ్వవిద్యాలయంలో థీసీస్‌లను ఆయా వర్శిటీల పోర్టల్‌లో డిజిటల్ రూపంలో ఉంచితే అందులో సత్తా ఏమిటో ఎవరికైనా అర్ధమవుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.