తెలంగాణ

కాంగ్రెస్ అవకాశవాద పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ 1969లో తెలంగాణ ఉద్యమంలో 369 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నిలదీశారు. 2004 నుండి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకాలు అందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎపుడూ అవకాశవాద రాజకీయాలే చేసిందని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో మద్దతు ఇచ్చి ఇపుడు గులాం నబీ అజాద్ విచిత్రంగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా రాఫెల్ జపం చేస్తోందని, కానీ అందుకు వారు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి బోఫోర్స్ కేసు గురించి దత్తాత్రేయ విస్తృతంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా పాలనలో విఫలమైందని ఆరోపించారు. దళారులు మధ్యలో ఉండి డబ్బులు తీసుకున్నారే తప్ప ఇళ్లు మాత్రం ఇవ్వలేదని పేర్కొన్నారు. అక్టోబర్ మొదటి వారంలో మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్టోబర్ రెండో వారంలో పెద్ద సత్యాగ్రహాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నపుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, హైదరాబాద్ ప్రజలను కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు పూర్తిగా నిర్లక్ష్యం వహించాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నేరుగా లబ్దిదారుడు, బ్యాంకుతో అనుసంథానం అయి ఉంటుందని , రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర పోషించడంలో వైఫల్యం చెందిందని అన్నారు. ఇళ్ల నిర్మాణంలో నత్తనడకలో ఉన్నది తెలంగాణ ప్రభుత్వమేనని, అంతా కుటుంబ పాలనలో నడుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత అన్ని విషయాల్లో కనిపిస్తోందని చెప్పారు.