తెలంగాణ

వట్టివాగు ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 21: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా రాత్రి వరకు భారీ వర్షం కురువగా కరీంనగర్ - నిజామాబాద్ ప్రధాన రహదారి వట్టివాగు కొట్టుకుపోయి వంతెనపై నుండి నీరు పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం మీదుగా నిజామాబాద్ వెళ్లే వాహనాలను కోరుట్ల - మెట్‌పల్లి మధ్యలో నున్న వట్టివాగును దాటి వెళ్లేందుకు కోరుట్ల నుండి అయిలాపూర్, ముత్యంపేట, వేంపేట గ్రామాల మీదుగా తరలించే పనిలో డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐ, ఎస్సై లతోపాటు పలు శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. వాహనాలు వెళ్లకుండా మున్సిపల్ సిబ్బందిని అక్కడే ఉంచారు. భారీ వర్షానికి పట్టణాలతోపాటు గ్రామాల్లో రోడ్లు జలమయం కాగా లోతట్టు శివారు ప్రాంతాలు నీటమునిగాయి. వంతెలపై నుండి నీటి ప్రవాహం పెరుగడంతో రాకపోకలకు ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. చెరువులు, కుంటలు నీటితో నిండిపోయి నిండు కుండలా మారి జల కలను తలపించాయి. మురికి కాల్వల నుండి వర్షపు నీరు రోడ్లపైకి, ఇండ్లలోకి చేరడం, శుక్రవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు ఇండ్లలో నుండి బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. గణపతి మండలాల్లోకి వర్షం నీరు రావడంతో నిర్వాహకులు కూడా కొంత ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రమైన కృష్ణానగర్‌లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్రఇబ్బందులు తలెత్తాయి. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో 20.2మిల్లీ లీటర్లు, రాయికల్‌లో 16, ధర్మపురిలో 28, సారంగాపూర్ 30.2, మల్యాల 8.2, గొల్లపల్లి 23.8, పెగడపల్లి 25.2, కొడిమ్యాల 12.2, వెల్గటూర్ 24.2, కోరుట్ల 8.2, మేడిపల్లి 10.4, మెట్‌పల్లి 1.8, ఇబ్రహీంపట్నం 7.4, కథలాపూర్ 18.2, మల్లాపూర్ 20.8మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా 17మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జూన్ నుండి సెప్టెంబర్ 21వరకు జగిత్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది.