తెలంగాణ

పకడ్బందిగా ‘రెరా’ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ స్టేట్ రియల్ ఏస్టేట్ రెగ్యులేషన్ చట్టం (రెరా) పకడ్బందిగా అమలు చేయనున్నట్టు రెరా చైర్మన్, ఐఏఎస్ అధికారి రాజేశ్వర్ తివారీ పేర్కొన్నారు. రెరా కింద తమ వెంచర్లను నమోదు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఐదు వందల చదరపు మీటర్ల విస్థీర్ణం కంటే ఎక్కువగానీ, 8 యూనిట్ల కంటే గృహాలు కానీ కలిగిన వెంచర్లు తప్పనిసరిగా రెరా కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెరాలో నమోదు చేసుకోకుండా వెంచర్లను ప్రకటించడం కానీ, ప్రకటనలు ఇవ్వడం కానీ, బ్రోచర్ విడుదల చేయడం కానీ జరిగితే చట్టరీత్య చర్యలు తప్పవని రాజేశ్వర్ తివారీ హెచ్చరించారు. జనవరి 1, 2017 నుంచి మొదలుకొని ఆగస్టు 31, 2018 వరకు ప్రారంభించిన వెంచర్లన్నీ రెరా చట్టం పరిధిలోకి వస్తాయని వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించి సంస్థలకు భారీగా జరిమానా విధించనున్నట్టు ఆయన హెచ్చరించారు.