తెలంగాణ

ఐదులక్షల టన్నుల మక్కలు కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి ప్రస్తుత ఖరీఫ్‌కు సంబంధించి ఐదులక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, కొనుగోలుకోసం 259 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులకు ముందుగానే డబ్బు చెల్లించేందుకు మార్క్‌ఫెడ్ బ్యాంకుల నుండి రుణాన్ని తీసుకోవచ్చని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం పూచీ ఇస్తుందని వివరించారు. మార్కెట్లో మక్కల ధర తక్కువగా ఉన్నప్పటికీ, కనీస మద్దతు ధర అయిన 1700 రూపాయలకే కొంటామన్నారు. మినుములు, పెసల కొనుగోలుకు కూడా అనుమతి ఇవాఅ్వలని నాఫెడ్‌ను కోరామని మంత్రి పోచారం తెలిపారు.
నాఫెడ్ అనుమతి రాగానే మినుములు, పెసలను కూడా కనీస మద్దతు ధరకే రైతుల నుండి కొనుగోలు చేస్తామన్నారు. రైతులు తొందరపడి తమ వద్ద ఉన్న పంటలను తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. 2018-19 రబీ పంటకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం సమకూరుస్తుందని పోచారం తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జ, మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మక్కల కొనుగోలుపై అధికారులతో మాట్లాడుతున్న మంత్రి పోచారం