తెలంగాణ

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సంపత్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ ఉద్యోగుల సంక్షేమం కోసం పోరాటం చేస్తామని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ)కు కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన చిలగాని సంతోష్‌కుమార స్వామి తెలిపారు. టీఈఏ 17 వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగుల కోసం టీఈఏ తొలుత నుండి పోరాటం చేస్తూనే ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధానంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ను రద్దు చేయించేందుకు పోరాటం చేస్తున్నామని, ఈ పోరాటంలో విజయం సాధిస్తామన్నారు. ఉద్యోగులందరికీ టీఈఏ పాలక మండలి ప్రతినిధులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన గడ్డం బాలస్వామి తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీఈఏ సర్వసభ్య సమావేశంలో ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇప్పటి వరకు టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కే. గోపాల్‌రెడ్డి పదవీ విరమణ చేయడంతో కొత్తగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నుకోవాల్సి వచ్చింది. అధ్యక్షుడిగా బాధ్యతల నుండి తప్పుకున్న గోపాల్‌రెడ్డిని గౌరవ అధ్యక్షుడిగా సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సంతోష్‌కుమార స్వామి కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని పచ్చునూర్ గ్రామానికి చెందిన వారు. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన స్వామి ప్రస్తుతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. టీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బాలస్వామి వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దమరూరు గ్రామానికి చెందిన వారు. ఆయన ప్రస్తుతం నాంపల్లి క్రిమినల్ కేర్టులో పనిచేస్తున్నారు. ఈ సమావేశంలో టీఈఏ కేంద్ర కార్యవర్గ సభ్యులతో పాటు 31 జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.