తెలంగాణ

ఐపీపీబీల ద్వారా పింఛన్లు, ఉపాధి కూలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ పింఛన్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతనాలు చెల్లించే అంశం పరిశీలనలో ఉందని హైదరాబాద్ పోస్టల్ రీజియన్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎస్‌వీ రావు తెలిపారు. ఎస్‌వీ రావు హైదరాబాద్ పోస్టల్ రీజియన్ డీపీఎస్‌గా బాధ్యతలు నిర్వరిస్తూ, హైదరాబాద్ పోస్టల్ సర్కిల్ మీడియా అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు. ఆంధ్రభూమి ప్రతినిధికి ఆదివారం ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ, ఈ నెల ఒకటిన ప్రారంభమైన ఐపీపీబీలు రాష్ట్ర వ్యాప్తంగా చాలాబాగా పనిచేస్తున్నాయని వివరించారు. ప్రజల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఐపీపీబీల్లో డిపాజిట్ల పరిమితి ప్రస్తుతం అత్యధికంగా లక్ష రూపాయల వరకు ఉందని, భవిష్యత్తులో దీన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐపీపీబిల్లో డిపాజిట్లపై రోజువారీ బిల్లులకు సంబంధించి నాలుగు శాతం వడ్డీ ఇస్తున్నామన్నారు. వినియోగదారుల ఇళ్లకే ఐపీపీబీ సేవలను తీసుకువెళ్లామని, దాంతో ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. పోస్ట్ఫాసులు ఉన్న అన్ని గ్రామాల్లో ఐపీపీబీల సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అన్ని పోస్ట్ఫాసులకు ఆర్థిక సేవలను అనుసంధానం చేశామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 36 హెడ్ పోస్ట్ఫాసులు, 803 సబ్ ఆఫీసులు, 4971 బ్రాంచీ ఆఫీసులు ఉన్నాయని వివరించారు. వీటన్నింటినీ ఐపీపీబీ సేవలతో అనుసంధానం చేశామని వివరించారు. తాజా లెక్కల ప్రకారం 1,17,206 సేవింగ్స్ ఖాతాలను వినియోగదారులు ప్రారంభించారని, 2051 కరెంట్ అకౌంట్లు ప్రారంభమయ్యాయని ఎస్‌వీ రావు చెప్పారు.
పోస్ట్‌మెన్ల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ, డోర్ డెలివరీ సౌకర్యం ఉండటం వల్ల ప్రజల నుండి స్పందన బాగా ఉందని, ఉత్తరాల బట్వాడా సమయంలోనే ఐపీపీబీ సేవలు కూడా వారు అందిస్తారని ఎస్‌వీ రావు తెలిపారు. తాము ప్రారంభించిన క్విక్ రెస్పాన్స్ కార్డులు (క్యూఆర్‌సీ) ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు రాలేదని, ఏవైనా సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన సాంకేతిక సిబ్బంది తమకు అందుబాటులో ఉన్నారన్నారు.
పోస్టల్ సేవలు బలోపేతం
పోస్టల్ సేవలను మరింత బరోపేతం చేసేందుకు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామని, అన్ని పోస్ట్ఫాసులను కంప్యూటరైజ్ చేశామని ఎస్‌వీ రావు తెలిపారు. మానవ వనరులు కూడా పెంచుకుంటున్నామని, పోస్టల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని వివరించారు. గతంలో ప్రారంభంచిన ‘లాజిస్టిక్’ సేవలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం ఔషదాల సరఫరా కోసం ఇండియా పోస్ట్ లాజిస్టిక్ సేవలనే వినియోగించుకోవడం తమకు గర్వకారణమని తెలిపారు.