తెలంగాణ

బాలాపూర్ లడ్డూ మరో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: గణేశుడి లడ్డూల వేలం భాగ్యనగర్ ప్రజల్లో ఆసక్తి రేకెత్తించింది. ఏ గణేశుడి లడ్డూ ఎంతకు వేలంలో పోతుందో అంటూ రాజధాని ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీవీల ముందు చేరి చూశారు. షరామామూలుగానే బాలాపూర్ లడ్డూ అత్యధిక ధరకు వేలంలో పోయింది. ఈ లడ్డూను వేలంలో 16.60 లక్షలకు విక్రయించారు. బడంగ్‌పేట లడ్డూ 7.50 లక్షల రూపాయలకు పోయింది. బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు పనె్నండు మంది పోటీ పడ్డారు. ఆర్యవైశ్య సంఘం తరఫున టీ. శ్రీనివాస్‌గుప్తా ఈ లడ్డూను 16.60 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ 15.60 లక్షల రూపాయలకు నాగారం తిరుపతి రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. ఇలా ఉండగా బడంగ్‌పేట ప్రధాన గణేశుడి లడ్డూకు కూడా చాలా సంవత్సరాల నుండి బాగా డిమాండ్ ఉంది. బడంగ్‌పేట లడ్డూను ఈ సంవత్సరం సామ ప్రభాకర్‌రెడ్డి 7.50 లక్షల రూ.లకు దక్కించుకున్నారు. అత్తాపూర్ గణేశ్ లడ్డూను గుమ్మడి ప్రభాకర్‌రెడ్డి సోదరులు 2.51 లక్షలకు కైవసం చేసుకున్నారు. చాంద్రాయణగుట్టలో గణేశుడి లడ్డూను గౌలీపురాకు చెందిన కె. సువర్ణాచారి 2.45 లక్షలకు కొనుగోలు చేశారు. చాంద్రాయణ్‌గుట్ట గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూను రాచలూరి శ్రీహరిరాజ్ 1.15 లక్షలకు కొనుగోలు చేశారు. చందానగర్‌లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసినగణనాథుడి లడ్డూను సుప్రజ గ్రూప్ చైర్మన్ తూడి ప్రవీణ్ 2.31 లక్షలకు తీసుకున్నారు. అత్తాపూర్‌లోనే మణికంఠ భక్తసమాజం ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూను శ్రీధర్‌రెడ్డి తదితరులు 3.01 లక్షలకు కైవసం చేసుకున్నారు. బాచుపల్లిలో గణేశుడి లడ్డూను కొలను సీతారాంరెడ్డి 2.22 లక్షలకు కైవసం చేసుకున్నారు. విద్యానగర్‌లో లడ్డూను 1.51 లక్షలకు వేలం వేశారు. ఇతర ప్రాంతాల్లో కూడా గణేశుడి లడ్డూలకు బాగా డిమాండ్ వచ్చింది.
బాలాపూర్ ఘనం..
వినాయక చవితి వచ్చిందంటే అందరి దృష్టి బాలాపూర్ లడ్డూపైనే. ఈ లడ్డూకు అంతటి ప్రాశస్థ్యం వుంది. ఎందుకంటే మిగతా అన్ని చోట్ల కంటే వేలం పాటలో అత్యధిక రేటు వచ్చేది ఈ లడ్డూకే.
చిత్రాలు.. 16.60 లక్షలకు ఈ గణనాథుని లడ్డూను సొంతం చేసుకున్న టి. శ్రీనివాస్ గుప్తా.
*మరోపక్క బాలాపూర్ వినాయకుడి నిమజ్జనానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన జనం.