తెలంగాణ

తెలంగాణ అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ అరకు నియోజకవర్గం (ఎస్టీ) ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను ఆదివారం మావోయిస్టులు అతి దారణంగా కాల్చిచంపారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. నియోజక వర్గంలో పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయస్టులు చుట్టుముట్టి మట్టుబెట్టారు. గత రెండేళ్ళుగా మావోయిస్టులపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను కాల్చిచంపారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మావోయిస్టు చర్యలతో తెలంగాణలో పోలీసు వ్యవస్థను అప్రమత్తం చేశామని రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే జిల్లాల్లో పోలీస్ యంత్రాగాన్ని అలల్ట్ చేశామన్నారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు సమాచారం ఇవ్వకుండా పర్యటనలు చేపట్టవద్దని డిజిపి సూచించారు. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తాజా మాజీ సర్పంచ్‌ల నుంచి ఎమ్యెల్యే, ఎంపిల వరకు భద్రతను వినియోగించుకోవాలన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారం పాల్గొంటున్న నేపథ్యంలో ముందస్తుగా పోలీసులకు ప్రచార వివరాలను వెల్లడించాలన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన జిల్లాల్లో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రాష్ట్ర పోలీసు బలగాలకు అధనంగా కేంద్ర బలగాలను పెంచుతామన్నారు. గ్రేహ్యాండ్స్, అక్టోపస్ దళాలను మావోయిస్టు ప్రాంతాల్లో అప్రమత్తం చేస్తామని చెప్పారు. మహారాష్ట్ర, చత్తీష్‌గడ్, ఆంధ్రా ఏరియాల నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేయాలని, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీస్ గస్తీని పెంచాలని ఆయా జిల్లాల ఎస్పీలకు డిజిపి ఆదేశాలు జారీ చేశారు.

చిత్రం..డీజీపీ మహేందర్‌రెడ్డి