తెలంగాణ

భూ రికార్డులు అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ (మహబూబ్‌నగర్), నవంబర్ 27: నిజాం హయాంలో 72 ఏళ్ల క్రితం నిర్ణయంచిన సరిహద్దులనే ఇప్పటికీ కొనసాగించడం.. సర్వేలు తిరిగి జరపకపోవడంతో గ్రామాల్లో రైతులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ కారణంగా గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. భూ తగాదాలు, హత్యలు, కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఎన్‌టిఆర్ హయాంలో తహశీల్దార్ కార్యాలయం నుండి మండలాలు ఏర్పాటు చేసి రికార్డులు అక్కడికి తరలించడంలో అనేక రికార్డులు తారుమారైనట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ రికార్డులకు సంబంధించిన రక్షణ కౌలుదారు, వసూలు బాకీ, ఖాస్ర పహాణి, పహాణి, ఆర్‌ఓఆర్, పైసల పట్టీ తదితర రికార్డులను విలువ గల భూములకు సంబంధించిన పలుకుబడి గల వారికి సంబంధించిన రికార్డులు అధిక శాతం ప్రస్తుత తహశీల్దార్ కార్యాలయాలలో దొరకడం లేదు. దీంతోపాటు నైజాం కాలం రికార్డులు ఉండడం వల్ల గతంలో ఉన్న రిజిస్టర్లు కొన్ని చినిగిపోవడం, దీనికి సంబంధించిన వ్యవసాయ పొలాల టైటిల్ డీడ్, పాసుపుస్తకం, హక్కుదారుకు సంబంధించిన రికార్డులు దొరకడం లేదు. గ్రామాలలో 1943వ సంవత్సరం నైజాం హయాంలో ప్రతి సర్వే నంబర్, హద్దు బందులు సర్వే జరిపి పొలాలకు రాళ్లు ఏర్పాటు చేసి హద్దులను అప్పటి నైజాం ప్రభుత్వం కేటాయించారు. అప్పటి నుండి తిరిగి ప్రభుత్వాలు సర్వే జరపకపోవడంతో గ్రామాలలో హద్దుబందుల రాళ్లను తీసివేయడం, ఇతరుల పొలాలను పలుకుబడి గల వారు ఆక్రమించుకోవడం, ఇలాంటి సంఘటనల వల్ల గ్రామాలలో ఘర్షణలు జరగడం, దీంతో పోలీస్ కేసులు, రెవెన్యూ కేసులు పెట్టడం, గ్రామాలలో ఘర్షణల వల్ల ప్రశాంత వాతావరణం కనుమరుగవుతోంది. గ్రామాలలోని వ్యవసాయ పొలాల భూములకు డిమాండ్ రావడం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడంతో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ పొలాల ధరలు పెరిగిపోయాయ. వ్యవసాయ పొలాల రికార్డులు సక్రమంగా లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేసి విధిలేని పరిస్థితుల్లో గ్రామస్తులు మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు. రికార్డులు సరిగా లేవని అమాయక ప్రజల నుండి తక్కువ ధరకు భూములను కాజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రాష్టవ్య్రాప్తంగా వ్యవసాయ పొలాలను తిరిగి సర్వే నిర్వహించి హద్దుబందులు పూర్తిచేసి రైతులను కాపాడాలని వ్యవసాయదారులు కోరుతున్నారు.
రికార్డులు సక్రమంగా లేనిమాట వాస్తవమే
ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వ్యవసాయ పొలాలకు సంబంధించిన ఖాస్రా, రక్షత కౌలుదారు, పైసల పట్టి, వసూలు బాకీ రికార్డులు కొన్ని సక్రమంగా లేక చిరిగిపోయిన మాట వాస్తవమేనని, ఇలాంటిని పరిశీలించి ఉన్న వాస్తవాలను పై అధికారులకు పంపించగలమని తహశీల్దార్ చందర్‌రావు తెలిపారు.