తెలంగాణ

కేసీఆర్ లాంటి సీఎంను ఎక్కడా చూడలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును గద్దె దింపేందుకు దళితులు, గిరిజనులు నడుం బిగించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మావోయిస్టు భీమ్ భారత్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ళకు చెందిన భీమ్ భారత్‌కు, ఆయన అనుచరులకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటైన సభలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ దళితులకు, గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మేలు జరుగుతుందన్న నమ్మకంతో భీమ్ పార్టీలో చేరారని అన్నారు. జగ్జీవన్‌రాం కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ద్వారానే తనకు భీమ్ పరిచయమయ్యారని ఆయన తెలిపారు. దళితులపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును గద్దె దింపేందుకు దళితులు, గిరిజనులు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో బొంద పెట్టాలని, లేనిపక్షంలో సమాజం మనల్ని క్షమించదని అన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెడితే తామూ గౌరవించామన్నారు. కానీ మన పైసలతో సుమారు రూ.500 కోట్లతో కేసీఆర్ ఖరీదైన భవనాన్ని నిర్మించుకున్నారని విమర్శించారు. కేసీఆర్ బట్టేబాజి మాటలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. లక్షల ఓట్లు తొలగించినందున అందరూ అప్రమత్తమై సరిచూసుకోవాలని అన్నారు. నేరెళ్లలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాల్సిందేనని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సంక్షేమానికి పని చేస్తుందన్నారు. అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలన్నింటినీ అమలు చేస్తామని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. బీసీ, మైనారిటీల అభివృద్దికి పెద్ద పీట వేస్తామన్నారు.