తెలంగాణ

పరిశోధనా రంగంలో లింకన్ వర్శిటీ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: పరిశోధన రంగంలో మరింత నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు మలేషియాలోని పెటాలింగ్ జయలోని లింకన్ యూనివర్శిటీ కాలేజీతో ఉస్మానియా యూనివర్శిటీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. పిహెచ్‌డీ సూపర్‌వైజర్లకు, రీసెర్చి స్కాలర్లకు, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సహకారాన్ని లింకన్ యూనివర్శిటీ అందించనుంది. మలేషియా లింకన్ యూనివర్శిటీ వీసీ డాక్టర్ అమియా భౌమిక్, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రంలు ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రిజిస్ట్రార్ గోపాలరెడ్డి, మేనేజిమెంట్ డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, యుఎఫ్‌ఆర్‌ఓ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, ఐక్యూఎసీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3 నుండి అంతర్జాతీయ జల సదస్సు
అక్టోబర్ 3 నుండి మూడు రోజుల పాటు అంతర్జాతీయ జల సదస్సును హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహిస్తున్నట్టు అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ బయోలాజీకల్ ఇంజనీర్స్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీర్స్ సంస్థలు తెలిపాయి. తాగు, సాగునీటి కొరత, అంతర్జాతీయ జల సమస్యలపై చర్చలు నిర్వహించనుంది.
ప్రాంగణ ఇంటర్వ్యూలు
ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఏడాది మూడు వేల మందికి పైగా విద్యార్థులు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఇదో రికార్డు అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫోసిస్ 1185 మందిని, టీసీఎస్ 985 మందిని , కాగ్నిజెంట్ 648 మందిని విప్రో 202 మందిని రిక్రూట్ చేసుకుందని సంస్థ పేర్కొంది.