తెలంగాణ

జగ్గారెడ్డికి బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి కి సికింద్రాబాద్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది, అనంతరం బెయిల్ ప్రక్రియను ఆయన న్యాయవాదులు పూర్తి చేయడంతో జగ్గారెడ్డి చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యారు. రూ. 50 వేల చొప్పున రెండు పూచీకత్తులతో న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ప్రతి ఆదివారం మార్కెట్ పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలని షరతు విధించారు. భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు తీసుకువెళ్లి వారిని అక్కడే వదిలి వచ్చారనే ఆరోపణలపై జగ్గారెడ్డిని ఈ నెల 10న పోలీసులు అరెస్టు చేశారు. తాను, తన భార్య ఇద్దరు పిల్లలు అమెరికాకు వెళ్తున్నామంటూ 14 ఏళ్ల క్రితం జగ్గారెడ్డి నలుగురికి పాస్‌పోర్టులు తీసుకున్నారని, ఆ పర్యటన అనంతరం ఆయన ఒక్కరే తిరిగి వచ్చారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు జగ్గారెడ్డిపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో జగ్గారెడ్డి బెయిల్ దరఖాస్తు చేసుకోగా, న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు.
రాజకీయంగా దెబ్బ తీసేందుకే తప్పుడు కేసు
తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకే తప్పుడు కేసు పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) విమర్శించారు. మనుషుల అక్రమ రవాణా (పాస్ పోర్టు) ఆరోపణల నేపథ్యంలో అరెస్టు అయి నిందితునిగా జైలులో ఉన్న జగ్గారెడ్డికి సోమవారం బెయిల్ లభించింది. బెయిల్‌పై విడుదల జగ్గారెడ్డి నేరుగా గాంధీ భవన్‌కు చేరుకుని, మీడియాతో మాట్లాడుతూ తనను ఎదుర్కొలేక, కక్ష సాధింపుగా తప్పుడు కేసు బనాయించారని విమర్శించీరు. ప్రజల కష్టాలు తెలుసుకోవడమే తాను చేసిన నేరమా? అని ఆయన ప్రశ్నించారు. 14 ఏళ్ళ క్రితం నాటి తప్పుడు కేసును తిరగ తోడారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలను మానసికంగా కృంగ తీసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. ఎదిరించిన వారిని పోలీసులతో బెదిరించి కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తాను ఆరోపించినందుకే తప్పుడు కేసు పెట్టారని ఆయన ఆవేదనతో చెప్పారు. తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న నమ్మకం తనకు ఉందని జగ్గారెడ్డి మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. తాను గెలుపొందిన తర్వాత అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు చుక్కలు చూపిస్తానని ఆయన హెచ్చరించారు. పోలీసులు కూడా ఆలోచించి వ్యవహారించాలని, పాలకుల చేతుల్లో కీలు బొమ్మలు కారాదని అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులపై కేసులు లేవా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.