తెలంగాణ

మావోయిస్టు మిలీషియా సభ్యుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం(నూగూరు), సెప్టెంబర్ 24: వెంకటాపురం పోలీసు సర్కిల్ పరిధిలో పోలీసులు, ప్రత్యేక పోలీసు బలగాలు అడవుల్లో జల్లెడ పడుతున్నాయి. సరిహద్దులోని చత్తీస్‌గఢ్ రాష్ట్రం అటవీ గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారంతో పాటు అరకులో జరిగిన ఎమ్మెల్యే హత్యతో ఈ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నారు. వెంకటాపురం మండలం విజయపురి కాలనీ వద్ద సోమవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న సోడి హిద్మా అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన హిద్మా 2016 నుంచి పోలీసుల కదలికలతో పాటు మావోయిస్టు దళాలకు నిత్యావసరాలు, మందులను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వారోత్సవాలను జయప్రదం చేయాలని సంబంధిత వాల్‌పోస్టర్లు విజయపురి కాలనీ వద్ద కట్టేందుకు వస్తున్నట్లు తెలిసి అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. చర్ల, శబరి దళాలకు ఈ ప్రాంత సమాచారం చేరవేస్తున్నాడని, ఇతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.