తెలంగాణ

పశు పోషణకు ప్రభుత్వ ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 24: తెలంగాణ ప్రభుత్వం పశుపోషణకు పెద్దపీట వేసిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమావారం వరంగల్ అర్బన్ జిల్లా మామునూరులో వెటర్నరీ కళాశాలను ఆయన ప్రారంభించారు. పశువైద్య విద్యకు, వైద్యులకు, నిపుణులకు రాబోయే రోజుల్లో మహర్దశ పట్టనున్నదని ఆయన అన్నారు.
పీవీ నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఆధ్వర్యంలో మామునూరుకు మంజూరైన పశువైద్య కళాశాలను ఆయన ప్రారంభించారు. 40 మంది విద్యార్థుల సామర్ధ్యంతో 2018-2019 విద్యా సంవత్సరంలో ప్రారంభించిన ఈ కళాశాల తెలుగు రాష్ట్రాలకు దిక్సూచీగా నిలవాలని ఆకాంక్షించారు. వరంగల్ నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల అమలులో భాగంగా ప్రభుత్వం ఈ పశువైద్య కళాశాలను మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రావడం వలనే ఈ కళాశాలను తెచ్చుకోగలిగామని అన్నారు. ప్రవేశం పొందిన 38 మందిలో 24మంది బాలికలు, 14 మంది బాలురు ఉన్నారని ఆడపిల్లల ప్రతిభకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్ని పోటి పరీక్షలలో బాలికలే ముందుంటున్నారని, ఎక్కువ సీట్లను, ఉద్యోగాలను పొందుతున్నారని చెప్పారు. పశువైద్య విద్యకు మెడిసిన్‌తో సమాన ప్రాధాన్యత ఉన్నదని అన్నారు. కళాశాల నిర్వహణకు ప్రస్తుతం డీప్యూటేన్లపై అన్ని కేటగిరిల పోస్టులను నియమించినుట్ల తెలిపారు. త్వరలోనే రెగ్యులర్ పోస్టుల నియామకం జరుపనునట్లు హామీ ఇచ్చారు.
గతంలో ఐదేళ్లపాటు డైరీని నడిపిన అనుభవం ఉన్నదని, పాడి పశువుల ఆరోగ్య సంరక్షణకు పశువైద్యుల సేవలు తప్పనిసరి అని అన్నారు. సబ్సిడీపై గొర్రెలు, బర్రెలు, చేపపిల్లలను పంపిణీ చేసి మార్కెటింగ్ వసతి కల్పించుటకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తునట్లు తెలిపారు. మామునూరు పశువైద్య కళశాల విద్యార్ధుల సౌకర్యార్ధం తన ఎమ్మెల్సీ నిధుల నుండి ఒక బస్సును కొనుగోలు చేసి అప్పగించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

చిత్రం..మామునూరులో వెటర్నరీ వైద్య కళాశాలను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి