రాష్ట్రీయం

ఈసీ సాంకేతిక బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట: రోజురోజుకు పెరిగిపోతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను సులభతరం చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు సాగుతోంది. ఒకప్పుడు ఎన్నికలు అంటే ఓ పెద్ద ప్రహాసనంగా.. పోలింగ్ రోజున ఉత్కంఠభరిత పరిస్థితులు.. గతంలో బ్యాలెట్ బాక్సుల్లో ఇంకులు పోయడం, ఎత్తుకెళ్లడం లాంటి ఘటనలు చోటుచేసుకునేవి. ఓట్ల లెక్కింపు కూడా పూర్తి అయ్యేందుకు రోజుల తరబడి సమయం పట్టేది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎన్నికల నిర్వహణను చేపట్టేందుకు ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్‌లు (ఈవీఎంలను) తొలుత అందుబాటులోకి తెచ్చింది. వీటి వినియోగంతో ఎన్నికల నిర్వహణ అత్యంత సులభతరంగా మారడంతోపాటు అక్రమాల నిరోధానికి దోహదపడింది.
వీవీ ప్యాట్‌లతో పారదర్శకత
ఈవీఎంల వినియోగంతో నిర్వహణ సులువైనప్పటికి వీటి వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారంలో ఉన్న పార్టీలు వాటిని ట్యాంపరింగ్ చేసి తమకు అనుకూలంగా మార్చుకుంటూ అడ్డదారిలో గద్దెనెక్కుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ దరిమెలా ఓటర్లు, రాజకీయ పార్టీలో నెలకొన్న అపోహలను తొలగించి పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఓటువేసిన వ్యక్తి తాను కోరుకున్న అభ్యర్ధికే ఓటు పడిందో లేదో పరిశీలించేందుకు వీలుంటుంది. ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా ముందస్తు ఎన్నికల్లో వీవీ ప్యాట్‌లను వినియోగించనున్నారు.
వీవీప్యాట్ పనిచేసే విధానం
వీవీప్యాట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి అనుసంధానించి ఉంటుంది. ఓటరు తాను కోరుకున్న అభ్యర్ధి పేరుకు ఎదురుగా ఈవీఎంలో ఉన్న మీట నొక్కగానే పక్కనే ఉండే వీవీప్యాట్ యంత్రం నుంచి రశీదు ముద్రితమవుతుంది. ఈ యంత్రం మధ్యలో చిన్న గాజు అద్దంలో నుంచి ఎవరికి ఓటు వేశామనేది దర్శనమిస్తుంది. ఓటరు యంత్రంలో ఉన్న ఈ రశీదుతో వివరాలను చదివేందుకు వీలుంటుంది. అందువల్ల ఓటరు తాను వేసిన ఓటు అనుకున్న అభ్యర్ధికే నమోదు అయిందీ, లేనిది అక్కడికక్కడే పరిశీలించే వీలుంటుంది. అయితే ఓటరు ఆ రశీదును చించి తీసుకోవడానికి వీలుండదు. వీవీప్యాట్ యంత్రంలో ఓటువేసిన తర్వాత 7 సెకన్ల వరకు ఓటు ఎవరికి పడిందో కనిపించి ఆ తర్వాత దిగువ భాగంలో ఉండే డ్రాప్ బాక్సులో పడిపోతుంది. ఓట్ల లెక్కింపు సమయంలో తిరిగి లెక్కించాల్సి వచ్చిన సందర్భంలో వీవీప్యాట్‌లో రశీదులను పరిశీలిస్తారు. ఈ యంత్రం పోలింగ్ అధికారి ఆధీనంలో ఉండటం వల్ల దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. అంతేకాకుండా వీవీప్యాట్ నుంచి వెలువడే రశీదులో ఓటు ఎవరికి పడిందో ఆ అభ్యర్ధి పేరు ఉంటుంది. ఆ అభ్యర్ధికి కేటాయించిన గుర్తు, వరస సంఖ్య రశీదులో ముద్రితమవుతుంది.
జిల్లాకు చేరిన యంత్రాలు
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. జిల్లాలో మొత్తం 1089 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎన్నికల నిర్వహణ కోసం 1740 ఈవీఎంలు, 1360 కంట్రోల్ యూనిట్లు, 1470 వీవీప్యాట్‌లను ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరాయి. బెంగళూరులోని బీహెచ్‌ఈఎల్ నుంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య రెండు రోజుల క్రితం ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తీసుకవచ్చారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఉన్న గిడ్డంగిని స్ట్రాంగ్‌రూంగా గుర్తించి వాటిని భద్రపరిచారు. జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్, జేసీ డి.సంజీవరెడ్డిల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను పరిశీలించి భద్రపరిచే ప్రక్రియను చేపట్టారు. స్ట్రాంగ్‌రూం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు.
చిత్రం... .వీవీప్యాట్ యంత్రం...