తెలంగాణ

గురుకులాల పీజీటీ, టీజీటీ పరీక్షలు హాల్‌టిక్కెట్లు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: గురుకులాల్లో 960 టీజీటీ , 1972 పీజీటీ పోస్టులకు ఎంపిక పరీక్షలు ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్నాయి. అవి వచ్చే నెల 24 వరకూ జరుగుతాయి. మధ్యలో రెండు పోస్టులకు కామన్‌గా ఉన్న పేపర్లు అక్టోబర్ 6న జరుగుతాయి. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థ్ధుల హాల్‌టిక్కెట్లు సిద్ధమయ్యాయని గురుకులాల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. అభ్యర్ధులు తమ హాల్‌టిక్కెట్లను రిక్రూట్‌మెంట్ బోర్డు పోర్టల్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
గ్రూప్ -4లో మరో 74 పోస్టులు
గ్రూప్ -4 రిక్రూట్‌మెంట్‌లో మరో 74 అదనపు పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో 44 స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందినవి కాగా, మరో 30 ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్‌వి ఉన్నాయి. దీంతో గ్రూప్ -4 పోస్టుల సంఖ్య 1595కు పెరిగింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారికి కూడా ఈ పోస్టుల పెంపు వర్తిస్తుందని సర్వీసు కమిషన్ పేర్కొంది.
రాష్టస్థ్రాయి మూట్ కోర్టు పోటీలు
రాష్టస్థ్రాయి మూట్ కోర్టు పోటీలను 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు మార్వాడీ శిక్షా సమితి న్యాయ విద్యా కళాశాల డైరెక్టర్ డాక్టర్ డీవీజీ కృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ డి మనోజ్ సోమేశ్వర్, కన్వీనర్ ఏ మురళీ తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ రాజా సదారాం, ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎస్‌బీ ద్వారకానాధ్, ప్రొఫెసర్ కే పంత్ నాయక్, ప్రమోద్‌కుమార్ కేడియా హాజరవుతారని అన్నారు. ముగింపు కార్యక్రమానికి జస్టీస్ టి అమర్‌నాధ్ గౌడ్, ప్రొఫెసర్ జీబీ రెడ్డి, బాల్‌చంద్ సంచాతి హాజరవుతారని చెప్పారు. ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని అన్నారు. సమాచార హక్కు చట్టంలో నిబంధనలపై అవగాహన కల్పించడం మూట్ కోర్టు ముఖ్య ఉద్ధేశ్యమని వారు తెలిపారు.