తెలంగాణ

పరిశోధనలపై అవగాహనకు ఓపెన్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: బాలల్లో శాస్ర్తియ జిజ్ఞాస పెంచేందుకు , పరిశోధనలపై అవగాహన పెంచేందుకు కృషి జరుగుతోందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి ఫౌండేషన్ డే పురస్కరించుకుని సెప్టెంబర్ 26న ఉదయం 8.30 నుండి సాయంత్రం 4.30 వరకూ ప్రజల సందర్శనార్ధం హైదరాబాద్‌లోని సీసీఎంబీ తలుపులు తెరచుకుని ఉంటాయని ఆయన చెప్పారు. ప్రతి ఏడాది ఇదే రోజున సీసీఎంబీలో జరుగుతున్న పరిశోధనలపై ఆసక్తికరమైన విషయాలను ప్రజలకు తెలియజేయడానికి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల నుండి రమారమి 10వేల మంది విద్యార్ధులు అధ్యాపకులు సందర్శనార్ధం తమ పేర్లను నమోదు చేసుకున్నారని అన్నారు. సీసీఎంబీలో జరుగుతున్న వివిధ ప్రముఖ పరిశోధనలను ప్రదర్శనల ద్వారా తెలియజేస్తామని అన్నారు. శాస్త్ర పరిశోధనల ప్రాభవాన్ని, ఉపయోగాలను వివరించే అనేక స్టాళ్లను ప్రదర్శిస్తామని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు వివిధ వృత్తుల్లో ఉన్నత విద్యకై అవకాశాలు తెలిపే స్టాళ్లను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. లక్నోలో ఈ ఏడాది నిర్వహించిన ఉత్సవం -2018 విశేషాలను కూడా తెలియజేస్తారు. హైదరాబాద్‌లోని వివిధ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న విద్యాసాధనం ఫోల్డ్ స్కోప్ గురించి ఒక బూత్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ఉన్న అనేక పోస్టర్లు ప్రదర్శనలు ఆరోగ్యపరమైన వివిధ సమస్యలకు ఎదుర్కొనే పద్ధతులను వివరిస్తారు. ప్రదర్శకులు ఈ స్టాళ్లలో తమకు ఇష్టమైన కార్యక్రమాల్లో పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా యువ శాస్తవ్రేత్తలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నామో తెలియజేస్తామని ఆయన అన్నారు.