తెలంగాణ

కొండా కథ కంచికి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మొదట టీడీపీ, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చివరగా టీఆర్‌ఎస్ నాలుగు మజీలు పూర్తి చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ కథ టీఆర్‌ఎస్‌లో కూడా కంచికి చేరింది. పార్టీలు మార్చినప్పుడల్లా వెళ్తు, వెళ్తూ ఓ నాలుగు రాళ్లు విసిరేసి వెళ్లడం కొండా సురేఖకు అలవాటే. కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్లినప్పుడు కెవిపి రాంచందర్‌రావుపై, వైఎస్‌ఆర్‌సిపీని వదిలేసినప్పుడు జగన్ను, తాజాగా టీఆర్‌ఎస్‌ను వదిలేస్తూ కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసింది. ప్రతి మజిలీని దాటినప్పుడల్లా బహిరంగ లేఖ ఒకటి విడుదల చేసివెళ్లడం కొండా దంపతులకున్న మరో అలవాటు. ముందస్తు ఎన్నికలకు 105 మంది అభ్యర్థులను ప్రకటించి 14 స్థానాలకు ప్రకటించకుండా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ 14 స్థానాల్లో కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించిన వరంగల్ ఈస్ట్ స్థానం కూడా ఉంది. త్వరలోనే వీటిని కూడా ప్రకటించబోతున్నట్టు కేసీఆర్ సంకేతాల్ని ఇచ్చారు. అయితే తనకు ఎలాగు టికెట్ రాదన్న అంచనాతో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకపడింది. 24 గంటలలోపు తనకు సమాధానం చెప్పాలని పార్టీ అధిష్ఠానానికి సురేఖ గడువు విధించింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక ఎలాగు టికెట్ రాదన నిర్దారించుకుని సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకపడటంతో టీఆర్‌ఎస్‌లో సురేఖ కథ ముగిసింది.
పెండింగ్ నియోజకవర్గాలకు ప్రకటించే అభ్యర్థులలో కొండా సురేఖ పేరును టీఆర్‌ఎస్ అధిష్ఠానం పరిశీలనలోనే ఉండింది. అయితే సంయమనం పాటించకుండా తన టికెట్‌కు మంత్రి కేటీఆరే అడ్డుతగిలాడన్న అనుమానంతో సురేఖ ఆయన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. దీనిని కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. మొదటి మీడియా సమావేశంలో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను విమర్శించినప్పటికీ ఒక దశలో సురేఖకే టికెట్ ఇవ్వాలని యోచించింది. అయితే కేటీఆర్ కోటరీ, తెలంగాణ అంటే కేసీఆర్ ఇల్లు కాదు వంటి ఘాటైన విమర్శలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. పార్టీలో అసమ్మతి మొగ్గను ఆదిలోనే తెంచకపోతే భవిష్యత్‌లో ఇతరులు కూడా గొంతెత్తే ప్రమాదం ఉందని కేటీఆర్ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో సురేఖకు టికెట్ ఇవ్వవద్దని కేటీఆర్ పట్టుబట్టడంతో విధిలేని పరిస్థితుల్లోనే ఇతరుల పేర్లను పరిశీలించినట్టు సమాచారం. ఈ విషయం తెలిసాకే ఇంతకాలం వౌనంగా ఉన్న కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌తో తెగతెంపులు చేసుకోవడానికి సిద్దమై తీవ్రస్తాయిలో విరుచకపడినట్టు తెలిసింది. కొండా సురేఖ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో వరంగల్ ఈస్ట్ స్థానానికి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అభ్యర్థిత్వాన్ని టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టే తెలిసింది.