తెలంగాణ

అగ్రిగోల్డ్‌తో లింకులు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: అగ్రీగోల్డ్ సంస్థతో తనకు లింకు ఉందని అంటున్నారని, తనకు అగ్రీగోల్డ్‌తో ఎలాంటి లింకులు లేవని , అవాస్తవాలు చెబితే వైకాపా నేత పార్థసారథిపై పరవునష్టం దావా వేస్తానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సీ కుటుంబరావు చెప్పారు. మంగళవారం నాడు ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. ఒకపుడు అమిత్ షా కూడా స్టాక్ బ్రోకర్‌గానే పనిచేశారని, తాను స్టాక్స్‌లో పనిచేసినంత మాత్రాన ఎద్దేవా చేయనక్కర్లేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గత నాలుగేళ్లలో 90 సార్లు విదేశీ పర్యటన చేశారని, ఒకసారి కంటే ఎక్కువగా 40 దేశాలు, రెండుసార్లు 11 దేశాల్లో పర్యటించారని, మూడుసార్లు మూడు దేశాల్లో, నాలుగుసార్లు మూడు దేశాల్లో, ఐదుసార్లు రెండు దేశాల్లో పర్యటించారని, చైనా, అమెరికాల్లో ఐదుసార్లు పర్యటించారని, ఈసందర్భంగా మనదేశంతో సంబంధాలు ఏమైనా మెరుగుపడ్డాయా అని నిలదీశారు. భారత్ నుండి ఉద్యోగాలకు వెళ్తున్న భారతీయుల వీసాలపై అమెరికా ఎన్నో ఆంక్షలు పెడుతోందని ఇదేనా ప్రధాని అమెరికా పర్యటనలో సాధించింది అని నిలదీశారు. 600 కోట్ల బడ్జెట్ ఉన్న ఫిషరీస్ శాఖలో 6700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేసిన ఎంపీ జీవీఎల్ తర్వాత దానిపై మాట్లాడలేదని అన్నారు.
బాధ్యతలు విస్మరించిన కేంద్రం: లంకాదినకర్
కేంద్రప్రభుత్వం తను నెరవేర్చాల్సిన బాధ్యతలను విస్మరించి ఇతర అంశాలపై దృష్టి పెడుతోందని, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అబద్దాల పుట్టిగా మారారని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. బుధవారం నాడు ఆయన ఎన్టీఆర్ భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ పదే పదే టీడీపీపై ఆరోపణలు చేయడం, అవాస్తవాలు గుప్పించడం సరికాదని అన్నారు. చంద్రబాబుకు ఐరాసలో మాట్లాడే అవకాశం రావడంతో సహించలేక జీవీఎల్ అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చంద్రబాబు ప్రపంచం దృష్టికి తెచ్చారన్నారు అమరావతి అభివృద్ధిపై జగన్, జీవీఎల్‌కు కడుపు మంటగా ఉందని విమర్శించారు. ఏదో విధంగా చంద్రబాబుపై తప్పుడు కేసులు వేసి వేధించాలని చూస్తోందని దినకర్ అన్నారు. తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ వెరవబోదని అన్నారు. బీజేపీ నాయకులు రాఫెల్ కుంభకోణంపై జేపీసీకి అంగీకరించాలని అన్నారు.