తెలంగాణ

మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, సెప్టెంబర్ 25: ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి అధిక ప్రధాన్యతను ఇస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ ఆలీ అన్నారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మంగళవారం పట్టణంలోని ఐబీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం అన్ని కులాలకు ప్రాధాన్యతను ఇస్తుందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే రాష్ట్ర ప్రత్యేకత సంతరించుకుందని అన్నారు.
మైనార్టీల అభివృద్ధి కోసం దేశం మొత్తంలో 4,700 కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందన్నారు. 50 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం 12 రెసిడెన్షీయల్‌పాఠశాలలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతమూడేళ్లలోనే 206 మైనార్టీ రెసిడెన్షీయల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 65 వేల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత వక్ఫ్ భూములను కాపాడుకోగలిగామని పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా 21 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కేవలం రంగారెడ్డి జిల్లాను మాత్రమే ఏర్పాటు చేశారని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి శుద్ద జలం అందించేందుకు మిషన్ భగీరథ పథకం చేపట్టారని తెలిపారు. అదే విధంగా చెరువుల పునరుద్దరణతో కోటి ఎకరాలకు సాగు నీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టి మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశ పెట్టి విజయవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు.