తెలంగాణ

సిరిసిల్లలో జాతీయ స్థాయి క్రీడా స్టేడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, సెప్టెంబర్ 25: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘జాతీయ స్థాయి క్రీడల స్టేడియం, పట్టణంలో వంద ఎకరాల్లో ‘అర్బన్ పార్కు’ నిర్మించనున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. మంగళవారం సిరిసిల్లలో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి కేటీఆర్ తొలుత అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించి, మానేరులో బతుకమ్మ ఘాట్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి, ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి మంగళవారం సాయంత్రం మంత్రి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల అభివృద్ధిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించామని, పెండింగ్ పనలన్నీ వేగవంతం చేయాలని ఆదేశించామన్నారు. ఇంటింటా మంచినీరు ఇవ్వడానికి మిషన్ భగీరథ పనులు 90 శాతం పూర్తి అయ్యావని, రానున్న కొద్ది రోజుల్లోనే తాగునీరు అందించగలమన్నారు. ఇక్కడ వందల అడుగుల లోతు బోర్లు వేసి నీటి కోసం తాపత్రయ పడుతున్న దశలో మిషన్ భగీరథ పనులు చేపట్టడం సామాన్య పని కాదన్నారు. సిరిసిల్ల పట్టణ బైపాస్ రోడ్డు సమీపంలో 92 ఎకరాలలో నిర్మిస్తున్న కలెక్టరేట్ కాంప్లెక్స్ సమీపంలోనే ‘జాతీయ స్థాయి క్రీడల స్టేడియం’ అన్ని హంగులతో నిర్మించ తలపెట్టామన్నారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు, జనవరి 26 గణతంత్ర, ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలు కూడా ఇక నుంచి ఇక్కడే జరుగుతాయన్నారు. అలాగే పట్టణంలో 50 నుండి 100 ఎకరాల స్థలంలో ‘అర్బన్ పార్కు’ నిర్మించేంనుకు భూసేకరణ చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు తరహాలో నిర్మిస్తున్నామన్నారు. మిడ్ మానేరు నిండితే సిరిసిల్ల మానేరు బ్రిడ్జి వరకు నీరు వస్తుందని, దీని బ్యాక్ వాటర్ వద్ద ‘మిడ్ మానేరు రివర్ ఫ్రంట్’కు నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడ మానేరు తీరం వెంట వాకింగ్ సైక్లింగ్‌లకు మంచి ఆహ్లాదకరంగా ఉండేలా నిర్మాణాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇక మూడేళ్ళలో సిరిసిల్లకు రైల్వే లైన్ పూర్తి అవుతుందని, ఇందు కోసం తంగళ్ళపల్లిలో సిరిసిల్ల రైల్లే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌కు వద్ద కరకట్ట నిర్మించి, దీనికి అనుగుణంగా రైల్వే అలైన్‌మెంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ టూరిజం అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయన్నారు.
ఇందు కోసం అక్వాకల్చర్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని నిర్మాణాలను తొలగించి 3.30 ఎకరాల స్థలంలో ‘ఇండోర్ స్టేడియం’ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి నేతన్నలకు బతుకమ్మ చీరల ఉత్పత్తితో ఉపాధి కల్పిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పంపడానికి ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న చీరలు 98 శాతం పూర్తి అయ్యావని, అన్ని జిల్లాలకు 90 లక్షల చీరెలను అక్టోబర్‌లో పంపడానికి జిల్లా కలెక్టర్‌కు ఆదేశించామన్నారు. సిరిసిల్లలో రూ.6 కోట్లతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్మిస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో రూ.9 కోట్లతో మరో అధునాతన వెజిటేబుల్, నాన్ వెజిటేబుల్ కూరగాయల మార్కెట్‌ను నిర్మిస్తున్నామని, గజ్వేల్‌లో నిర్మించిన తరహాలో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సిరిసిల్లలో కొత్తగా 11 కి.మీ.రింగ్ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్ల రహదారి పనులు చేపట్టామన్నారు. మొత్తం 19 కి.మీ.రింగ్ రోడ్డు పనులు చేపట్టామన్నారు. వేములవాడ దేవస్థానం అథార్టీ ఆధ్వర్యంలో పనుల వేగం పెంచామని, శివరాత్రిలోపు గుడి చెరువు, రోడ్డు పనులు సంపూర్ణంగా పూర్తి చేయడానికి వేగం పెంచాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. తంగళ్ళపల్లి నుండి రాళ్ళపేట, గనె్నవానిపల్లె మీదుగా ముస్తాబాద్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకై ఆర్‌అండ్‌బికి ఆదేశించామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల ప్రెస్ క్లబ్‌లకు, విలేఖరుల డబుల్ బెడ్ ఇళ్ళకు వారం పది రోజుల్లో కార్యాచరణ చేపట్టి పట్టాలు అందచేస్తామని మంత్రి వెల్లడిస్తూ, ఇందుకు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 29న సిరిసిల్లలోని మత్స్య కార్మికులు 300 బైక్‌లు అందచేస్తామని, 400 మందికి బీసీ రుణాలు అందచేస్తామని, సిరిసిల్లలోని బీవైనగర్‌లో చట్టబద్దంగా ఇళ్ళ పట్టాలు లేని మూడు వేల మందికి పట్టా నివేశన స్థలాల పట్టాలు ఇవ్వనున్నామని, అలాగే మైనార్టీ సంక్షేమం కింద వెయ్యి మందికి కుట్టు మిషన్లు అందించనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్