తెలంగాణ

కూటమి వెనుక మహా కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 25: ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే తాపత్రయంతో జతకడుతున్న మహాకూటమి వెనుక మహాకుట్ర దాగి ఉందని మాజీ స్పీకర్ కేఆర్.సురేష్‌రెడ్డి అనుమానాలు వెలిబుచ్చారు. తెలంగాణలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే పరస్పరం విభేదించుకున్న ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని ఆయన ఆరోపించారు. కేవలం కేసీఆర్‌ను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో తమ సిద్ధాంతాలను సైతం పక్కనబెట్టి మహాకూటమిగా తెరపైకి వస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెరాసలో చేరిన మీదట తన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు తొలిసారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయనకు తెరాస నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ కల్వకుంట్ల కవిత క్యాంప్ కార్యాలయంలో సురేష్‌రెడ్డితో పాటు అర్బన్ తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాల సమక్షంలో కాంగ్రెస్, తెదెపా, వైఎస్సార్‌సీ పార్టీలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్షాల తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఆ పార్టీలకు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమం అనే ప్రధాన కూడలిలో కీలక దశ వద్ద తెలంగాణ రాష్ట్రం నిలిచి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న ‘కారు’ డ్రైవర్ (కేసీఆర్)ను మార్చాల్సిన అవసరం ఉందా? అని ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని హితవు పలికారు.
ఇదివరకు ఎవరూ చేపట్టని రీతిలో గడిచిన నాలుగున్నరేళ్లలోనే తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కేసీఆర్ ఎంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేశారని కొనియాడారు. దీనిని గమనించిన తాను, తెలంగాణను మరింతగా అభివృద్ధి చేసే సత్తా కేసీఆర్‌కే ఉందని విశ్వసించి ఆయన ఆహ్వానం మేరకు తెరాసలో చేరానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉండగా, తన పూర్వీకులు వందేళ్లుగా ఆ పార్టీకి సేవలందించారని అన్నారు.
తాను ఎలాంటి పదవులను ఆశించలేదని, టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకునే సమయానికే అధిష్టానం అభ్యర్థులను సైతం ప్రకటించిందని సురేష్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిచిపోకూడదన్న అభిమతంతోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. అర్బన్ తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ, వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై, అందరి మన్ననలు అందుకున్న కేఆర్.సురేష్‌రెడ్డి తెరాసలో చేరడంతో తమ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం చేకూరినట్లయ్యిందని, ఆయన చేరికతో ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో తెరాస మరింతగా బలపడిందన్నారు. విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత, రెడ్‌కో చైర్మన్ ఎస్‌ఏ.అలీం తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..నిజామాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
మాజీ స్పీకర్, తెరాస నాయకుడు కేఆర్.సురేష్‌రెడ్డి