తెలంగాణ

ముస్తాబైన తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ధగధగలాడుతోంది. పట్టుబట్ట కట్టి పండుగ జరుపుకోవడానికి రాష్ట్రం మొత్తం ముస్తాబైంది. రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లు పూరె్తై మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించే సంబురాలకు చిన్నా పెద్దా ముసలీ ముతకా సన్నద్ధమైంది. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించుకుంటోంది. ప్రత్యేక ఉద్యమ ఫలాన్ని పదిమందితో కలిసి పంచుకుని పండువ చేసుకోవడానికి ఉత్సాహం చూపుతోంది.

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ముస్తాబు అయింది. రాష్ట్రం ఏర్పడి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తి చేసుకొని మూడవ ఏడాదిలోకి ప్రవేశించింది. సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులను స్మరించుకుంటూ వారు కన్న కలలు, ఆశయాల సాధనకు పునరంకితం అవుతామన్న ప్రతినతో రాష్ట్భ్రావృద్ధికి దశ, దిశను నిర్దేశించుకునే వేడుకగా ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ ఊరు, వాడ నుంచి రాష్ట్ర, దేశ రాజధానుల వరకు ఆట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున సన్నహాలు చేసింది. రాష్ట్ర ఆవతరణ మొదటి ఏడాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినప్పటికీ, రెండవ ఏటా వేడుకలను అంతకంటే వైభవోపేతంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిష్టాకరంగా తీసుకుంది. దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన ధనిక రాష్ట్రంగా ఎదిగిన రాష్ట్ర ఆవిర్భావన వేడుకలను కూడా అదే స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర ఆవతరణ వేడుకలకు మునుపెన్నడూ లేనివిధంగా జిల్లాకు రూ. 10 కోట్ల చొప్పున ఖర్చు పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల రాజధాని నగరాల్లోనూ అక్కడ స్థిరపడిన తెలంగాణ వారి సంయుక్త సహకారంతో ఈ వేడుకలను నిర్వహిస్తోంది. రెండేళ్ల తెలంగాణ కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తూ భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు, బెలూన్లు ఏర్పాటు చేయడమే కాకుండా వివిధ భాష పత్రికలకు కూడా ప్రకటనలు జారీ చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సాధనలో అమరులైన వారి స్మారకార్థం సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్‌లో స్మారక స్థూపానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య స్ఫూర్తికి చిహ్నంగా దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండాను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ఆవతరణ వేడుకలను పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులను ఎంపిక చేసి ఒకోక్కరికీ రూ.1,00116 నగదు పురస్కారంతో ముఖ్యమంత్రి సత్కరించబోతున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల 470 కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాలను ఈ వేడుకల్లోనే ముఖ్యమంత్రి అందజేయనున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు 18 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి ఇదే వేదికపై నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందజేయబోతున్నారు. అలాగే ఈ వేడుకల సందర్భంగా రాష్ట్రాన్ని అందంగా ముస్తాబు చేసి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రధాన కూడళ్లును విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

చిత్రం... రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా తెలంగాణ చారిత్రక ప్రాంతాలకు దేదీప్యమైన విద్యుత్ కాంతులు అద్దారు. అతిపెద్ద జెండా ఆవిష్కరణకు ఇలా ఏర్పాట్లు చేశారు.