తెలంగాణ

టి-ఎమ్సెట్‌కు అభ్యర్థుల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఎమ్సెట్-2 నోటిఫికేషన్‌కు తొలి రోజు విశేష స్పందన కనిపించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని కన్వీనర్ డాక్టర్ ఎన్ వి రమణారావు వెల్లడించారు. తొలి రోజు 6వేల మంది దరఖాస్తు చేశారు. ఎమ్సెట్-2 మెడికల్ స్ట్రీం దరఖాస్తులను బుధవారం నుండి స్వీకరిస్తున్నారు. దాదాపు 60వేల మంది పరీక్షకు దరఖాస్తు చేస్తారని అంచనా. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్‌లో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ వర్శిటీల్లోని కేంద్రాలను ఇప్పటికే ఎమ్సెట్ అధికారులు మాట్లాడి ఉంచారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 7వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 2నుండి అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష జూలై 9వ తేదీన జరుగుతుంది.