తెలంగాణ

కొత్త పీఆర్‌సీని సాధించి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: ముందస్తు ఎన్నికలు, కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల అనుకున్న సమయానికి మధ్యంతర భృతి, కొత్త పీఆర్‌సీ, ఫిట్‌మెంట్ పొందలేకపోయామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐఆర్, పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ను సాధించుకుని తీరుతామని సంఘం ధీమా వ్యక్తం చేసింది.
ఈ విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని, నిరాశ, నిస్పృహలకు లోను కావద్దని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి మమత పిలుపునిచ్చారు. టీజీఎ భవన్‌లో ఆదివారం మమత అధ్యక్షతన టీజీఎ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మమత ప్రసంగిస్తూ కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త పీఆర్‌సీని సాధించుకోవడంతో పాటు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తీసుకొచ్చి సాధించుకుందామన్నారు. గెజిటెడ్ అధికారులకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపు, కొత్త జోనల్ విధానంలో ఉద్యోగుల సీనియార్టీకి అన్యాయం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అలాగే గెజిటెడ్ అధికారులు అందరికీ వాహన సౌకర్యం, రవాణా భత్యం తప్పని సరిగా ఇవ్వాలని డిమాండ్ చేసారు. సీపీఎస్ రద్దుకు నవంబర్ ఒకటిన జరిగే అఖిల భారత సీపీఎస్ రద్దు సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొనాలని మమత పిలుపునిచ్చారు.
వినూత్నమైన సంస్కరణలతో ఎన్నికల కమిషన్ పని చేస్తుందని కొనియాడారు. ఈ సంస్కరణలు ప్రజాస్వామ్య మనుగడ పరిడవిల్లడానికి దోహదం చేస్తుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే గెజిటెడ్ అధికారులు, ఉద్యోగులకు సరైన సౌకర్యాలు, కనీస వసతులు, తగిన భద్రత, రవాణా వసతి కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందన్నారు. విధులలో ఉన్న ఉద్యోగులకు ఎక్కడికక్కడే ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా ఆన్‌లైన్ ఓటింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని మమత సూచించింది.

చిత్రం..తెలంగాణ గెజిటెడ్ అధికారుల భవనంలో ఆదివారం జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తోన్న అధ్యక్షురాలు మమత