తెలంగాణ

న్యూ ఎకానమీ ఫోరమ్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మరో ఆహ్వానం అందింది. అంతర్జాతీయ స్థాయిలో నవంబర్ 6,7 తేదీలలో సింగపూర్‌లో నిర్వహించనున్న న్యూ ఎకానమీక్ ఫోరమ్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం లభించింది. వివిథ దేశాల నుంచి సుమారు మూడు వందల కంపెనీల ముఖ్య కార్య నిర్వాహకులు, వివిధ దేశాల రాజకీయ నాయకులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. వివిధ దేశాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సవాళ్లపైనా చర్చించి పరిష్కార మార్గాలను వక్తలు సూచించనున్నారు. నగరీకరణ, పట్టణ వౌలిక వసతుల కల్పన, ఐటీ రంగంపై కేటీఆర్ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాలుకు సవాళ్లపై చర్చించడానికి ఏర్పాటు చేసిన న్యూ ఎకానమీ ఫోరమ్‌లో పాల్గొనాల్సిందిగా తనకు ఆహ్వానం అందడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలలో ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకున్న చర్యలకు దక్కిన గౌరవంగా మంత్రి కేటీఆర్ కొనియాడారు.