తెలంగాణ

తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్‌తో రెచ్చగొట్టే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల: తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్‌ను వాడుకుని కేసీఆర్ రెచ్చగొట్టే కుట్ర పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కనె్వన్షన్ సభ గాజులరామారంలోని మహరాజ గార్డెన్‌లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. సభకు ముఖ్యఅతిథులుగా రేవంత్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విచ్చేశారు. ముందుగా భారీ ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా నుండి షాపూర్‌నగర్ మీదుగా గాజులరామారం గార్డెన్ వరకు వాహనాల ర్యాలీ కొనసాగింది. కూన శ్రీశైలం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని మొదలుపెడుతూ ప్రభుత్వ విద్యుత్ లేకపోయినా కాంగ్రెస్ కార్యకర్తల్లో విద్యుత్ ఉందని, టీఆర్‌ఎస్‌కు కరెంట్ షాక్ కొట్టిస్తామని చురకలు వేసారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌లను కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ మైనారిటీలను మోసం చేశాడని దుయ్యబట్టాడు. 60 రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయని, ప్రభుత్వాన్ని రద్దు చేసిన కేసీఆర్ ఏ రకంగా భాషా పదజాలంతో మాట్లాడుతున్నాడని, మిత్రపక్షాలపై దాడులు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత కొడుకు, అల్లుడు మంత్రులుగా, కూతురు ఎంపీ, సడ్డకుని కొడుకు ఎంపీగా వేల కోట్లు వ్యాపారం చేస్తున్నారు తప్ప అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేని కేసీఆర్‌కు తెలంగాణ సమాజం ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాను అమ్మనా, బొమ్మనా అని మాట్లాడిన కేసీఆర్ కంటే నీచుడు, కమీనే ఎవరైనా ఉంటారా అని అన్నారు. కేసీఆర్ మాటల్లో భయం పట్టుకుందని, రాజకీయ చావు భయం నెలకొందని, ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించవచ్చని చెప్పారు. మద్యం సేవించి వాహనం నడిపితే రాత్రి 9 గంటలకు పోలీసులు పుల్లపెట్టి జైలుకు పంపుతున్నారని, అదే మద్యం సేవించి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్‌ను తీసుకుపోయి అండమాన్ జైలులో పెట్టరా అని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్‌తో రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, హైదరాబాద్ నుండి చంద్రబాబు, అతని కుమారుడు అమరావతికి వెళ్లిపోయారని, ఓటు సైతం అమరావతిలోనే ఉందని వివరించారు. రాష్ట్రానికి కేసీఆర్ పీడ విరగడ కావాలనే కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు టీడీపీ ఇస్తుందని తెలిపారు. 60 రోజుల్లో తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబానికి యుద్ధం జరుగబోతుందని, కాంగ్రెస్‌కు అండగా ప్రజలు ఉంటే 60 నెలల పాటు కాంగ్రెస్ ప్రజల అభ్యున్నతి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయదని పేర్కొన్నారు. 60 రోజుల పాటు ఎక్కడికి వెళ్లినా ఎన్నికల గురించి చర్చించుకోవాలని, రాష్ట్రాన్ని పాలించేవాడు పాస్‌పోర్ట్ బ్రోకరా? కాంగ్రెస్ నాయకుడా అని ప్రశ్నించాడు. రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ, లక్ష ఉద్యోగాలు, పేదల ఇళ్లకు 5 లక్షలు, వృద్ధులకు రూ.2 వేల పెన్షన్ కావాలంటే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్‌కి అండగా ఉండి కూన శ్రీశైలం గౌడ్‌ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. మైనారిటీ ప్రజల పిల్లల ఉన్నత చదువుల కోసం ఆరు మెడికల్ కాలేజీలను కాంగ్రెస్ తీసుకువచ్చిందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు చేసిందేమీ లేదని విమర్శించారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినవే అన్నారు. మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని, త్రిపుల్ తలాక్ బిల్లు, నోట్ల రద్దు వంటి అనేక బిల్లులకు కేసీఆర్ మద్దతు తెలిపాడని మండిపడ్డాడు. సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, దళితున్ని సీఎం చేస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కేసీఆర్.. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను సైతం పదవి నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదని మండిపడ్డాడు. ముస్లింలతో పాటు అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో మైనారిటీ కాంగ్రెస్ నాయకుడు ఫక్రుద్దీన్, ఏఐసీసీ నేత బోస్ రాజు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
చిత్రం..ర్యాలీతో తరలివస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి