తెలంగాణ

గీత దాటితే వేటు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియమావళిని ధిక్కరిస్తే ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ హెచ్చరించారు. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం సచివాలయంలో శాంతి భద్రతలపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర శాంతి భద్రతల అదనపుడీజీ జితేందర్ హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన దారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇరువురు అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. నగదు, మద్యం సరఫరాపై నిరంతరం గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల అధికారులకు ఆయన ఆదేశించారు. గత ఎన్నికల్లో అలజడి సృష్టించిన వ్యక్తులు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి ఉన్న ఆయుధాలను సంబంధిత పోలీస్టేషన్లలో జమ చేయాలన్నారు. ఎన్నికల ప్రసంగంలో రెచ్చగొట్టే వారిపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారితో పాటు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులపై ప్రతి రోజూ నివేదికను అందించాలని పోలీసులకు రజత్‌కుమార్ ఆదేశించారు.