తెలంగాణ

నాయిని ప్రకటన సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: రాష్ట్ర అపద్ధర్మ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి కోరారు. అపద్ధర్మ మంత్రి నాయిని తన అల్లునికి ముషీరాబాద్ టిక్కెట్ ఇప్పించుకోవాలనుకున్నారని, అయితే కేసీఆర్ ఆయనకు నెల రోజులుగా కనీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. మంత్రులను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని ఆయన విమర్శించారు. ముషీరాబాద్ టిక్కెట్ కాకుండా ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లు నాయిని అన్నారని ఆయన చెప్పారు. ఉద్యమకారుడు నీతి, నిజాయితీ అని చెప్పుకునే కేసీఆర్ ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైందన్నారు.