తెలంగాణ

రేపు బీసీ సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: ముందస్తు ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 14న (ఆదివారం) తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల సమీకరణ, రాజకీయ విధానం, బహిరంగ సభ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పదాదికారులు, అనుబంధ సంఘాల నేతలు తప్పకుండా హాజరుకావాలని ఆయన కోరారు. ఇంకా ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వేల్పుల బిక్షపతి, మధుసూదన్, బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బర్క కృష్ణ, మహిళా అధ్యక్షురాలు వన్నడి రమ్య, రాజకుమార్ తదితరులు పాల్గొంటారని ఎర్ర సత్యనారాయణ తెలిపారు.