తెలంగాణ

ఆమె బీజేపీ సానుభూతిపరురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: దామోదర్ రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి ఇప్పటికీ బీజేపీ సానుభూతిపరురాలేనని బీజేపీ నేత జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకూ ఆమె బీజేపీ సానుభూతి పరురాలేనని, పార్టీలో చేరాలనే ఆమె వచ్చిందని, దాంతో తాము పార్టీలో చేర్చుకున్నామని, సాయంత్రం ఆమెకు ఏం ఇబ్బంది వచ్చిందో తెలీదు కానీ ఆలోచనలో మార్పు వచ్చిందని, బీజేపీలో చేరికను యూ టర్న్ తీసుకుందని, ఈ అంశంపై అంత ఆశ్చర్యం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , కనీసం ఒక్క శాతం కూడా పార్టీకి నష్టం లేదని అన్నారు. తాము ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని, టెన్షన్ పడటం లేదని చెప్పారు. ఎంఐఎం మతాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు పెంచుకోవాలని చూస్తోందని, దమ్ముంటే 119 స్థానాలకు ఎంఐఎం పోటీ చేయాలని సవాలు విసిరారు. కేసీఆర్ తర్వాత అయినా ఎపుడైనా దళితుడ్ని సీఎంను చేస్తారా అనే అమిత్ షా ప్రశ్నకు టీఆర్‌ఎస్ ఇప్పటికైనా సమాధానం ఇవ్వాలని కిషన్‌రెడ్డి అన్నారు. హైకోర్టులో ఇన్ని మార్లు మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం ఇంకోటి లేదని, ప్రభుత్వం తరఫున ముందస్తు ఎన్నికలపై చేసిన వాదనలు సరైనవి కావని చెప్పారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీ చట్టానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవర్తించిందని అన్నారు. అందుకే హైకోర్టు మొట్టికాయలు పెట్టిందని అన్నారు. పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని అన్నారు.