తెలంగాణ

దాడుల వెనుక మోదీ, కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: రానున్న ఎన్నికల్లో కేసీఆర్, నరేంద్రమోదీలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ హెచ్చరించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇంత వరకూ నెరవేర్చలేదని కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధులను హామీలపై నిలదీస్తే పారిపోయే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల్లో కూడా టీఆర్‌ఎస్‌పై పూర్తిగా వ్యతిరేకత ఉందని, కనుక మోదీ ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.కావాలనే చేసే దాడులను తాము వ్యతిరేకిస్తున్నామని, పార్టీలపైనా, బయటి నాయకులపైనా కక్ష పూరితమైన దాడులు చేయడం సమంజసం కాదని, ఉద్యమ సమయంలో చెప్పిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని, టీఆర్‌ఎస్ ఒక దోఖాబాజా పార్టీ, చీటర్‌పార్టీ, సీట్ల కేటాయింపు, సమస్యలపై సమర్థవంతంగా అందరితో కలిసి ముందుకు వెళ్తామని, ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాజకీయపక్షాలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం అలవాటుగా మారిందని, ఈ మధ్య అనేక రాష్ట్రాల్లో వారిని ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఈడీ, ఐడీలను ఉపయోగించి దాడులు చేయడం ఎంత వరకూ సమంజసమని అన్నారు. రాజకీయ ప్రేరేపిత దాడులు సరికాదని, అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని, ఏదైనా వ్యాపారంలో అక్రమంగా సంపాదించిన వారిపై దాడులు చేస్తారని కానీ సమయం, సందర్భం లేకుండా విపక్షాలపై కక్ష పూరితమైన దాడులు చేయడం కరెక్టు కాదని అన్నారు. రాజ్యాంగ సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని దాడులు చేస్తే వాటి వల్ల స్వల్పకాలిక నష్టం తప్ప పెద్దగా ప్రయోజనం లేదని అన్నారు. నరేంద్రమోదీ ప్రతిపాదించిన జమిలి ఎన్నికలకు జై కొట్టిన కేసీఆర్ ఈ రోజు నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించి అర్థాంతరంగా 9 నెలల ముందే అధికారాన్ని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు.
రాఫెల్ స్కాంపై బీజేపీ సమాధానం చెప్పాలి
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌లు వేర్వేరుగా పాత్రికేయులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడును ఎదుర్కోలేక టీడీపీ నేతలపై దాడులు నిర్వహిస్తున్నారనిఆరోపించారు. రాఫెల్ స్కాంపై ముందు బీజేపీ సమాధానం చెప్పాలని నిలదీశారు. తొలుత లంకా దినకర్ మాట్లాడుతూ టీడీపీ ఎన్‌డీఎ నుండి బయటకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం టీడీపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమిళనాడులో ఎన్నికలపుడు తమిళనాడులోనూ, యుపీలో ఎన్నికలపుడు యూపీలోనూ, తెలంగాణలో ఎన్నికలపుడు తెలంగాణలోనూ దాడులు నిర్వహించాని, ఇదంతా చూస్తుంటే రాజకీయంగా ఎదుర్కోలేకనే రాజ్యాంగ సంస్థలను వినియోగించుకుని ఈ రకమైన దాడులకు దిగుతున్నట్టు స్పష్టమవుతోందని అన్నారు. పార్లమెంటులో సమాధానం చెప్పలేకపోయిన మోదీ విభజన హామీలపై ప్రశ్నించిన నేతలపై కక్ష పూరితంగా దాడులు చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే పోతుల రామారావు, నేడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇళ్లపై దాడులు ఎందుకు నిర్వహించారో చెప్పాలని అన్నారు.